అంతర్జాతీయ బులియన్ మార్కెట్లో బంగారం ధరలు భారీగా పతనమయ్యాయి. స్పాట్ గోల్డ్ రేటు ఔన్సుకు 47 డాలర్ల మేర పడిపోయింది. దీంతో ఔన్స్ బంగారం ధర 4108 డాలర్ల వద్దకు దిగివచ్చింది. ఇక స్పాట్ సిల్వర్ రేటు ఈరోజు 3 శాతానికి పైగా పడిపోయింది. దీంతో ఔన్స్ వెండి రేటు 59 డాలర్ల స్థాయికి దిగివచ్చింది. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో పసిడి రేట్లు వరుసగా రెండో రోజూ భారీగా పతనమయ్యాయి. 24 క్యారెట్ల బంగారం రేటు 10 గ్రాములకు ఈరోజు రూ.1360 మేర పడిపోయింది. దీంతో తులం పసిడి ధర రూ. 1,45,260 వద్దకు దిగివచ్చింది. ఇక 22 క్యారెట్ల ఆభరణాల గోల్డ్ రేటు 10 గ్రాములపై రూ.1250 మేర తగ్గింది. దీంతో తులం రేటు రూ.1,33,150 వద్దకు దిగివచ్చింది. హైదరాబాద్ మార్కెట్లో వెండి ధరలు ఈరోజు స్థిరంగా ఉన్నాయి. అయితే క్రితం రోజు కిలో వెండి రూ.10 వేల మేర తగ్గిన సంగతి తెలిసిందే. ఇవాళ అదే ధర వద్ద ట్రేడవుతోంది. ప్రస్తుతం కిలో వెండి రూ.2,50,000 పలుకుతోంది. తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ జువెలరీల్లో ఒకటైన లలితా జువెలరీల్లో ఈరోజు బంగారం ధరలు తగ్గాయి. 22 క్యారెట్ల బంగారం 1 గ్రాముకు రూ.136 మేర తగ్గి రూ.14,526 వద్దకు దిగివచ్చింది. ఇక తులం బంగారం లెక్కలోకి తీసుకుంటే రూ.1,45,260 వద్ద అమ్ముడవుతోంద. వెండి ధర 1 గ్రాముకు రూ.250 వద్ద ఉంది. రచయిత గురించిబండ తిరుపతిబండ తిరుపతి సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు. ఆయనకు జర్నలిజంలో 10 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. 2023లో సమయంలో చేరిన తిరుపతి.. బిజినెస్ రంగానికి సంబంధించి తాజా వార్తలతో పాటు పర్సనల్ ఫైనాన్స్, పెట్టుబడులు, మ్యూచువల్ ఫండ్స్, స్టాక్ మార్కెట్ న్యూస్, బంగారం వెండి ధరలపై ఎప్పటికప్పుడు అప్‌డేట్లు అందిస్తున్నారు. ఫ్యాక్ట్ చెక్ ఆర్టికల్స్‌తో పాటు ప్రభుత్వ పథకాలకు సంబంధించిన సమాచారం సైతం
Actor ProfileCelebrity
పసిడి ప్రేమికులకు పండగే.. జులై 8న కుప్పకూలిన బంగారం ధరలు.. తాజా రేట్లు ఇవే
📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
Samayam Telugu•7 Oct 2026
పసిడి ప్రేమికులకు పండగే.. జులై 8న కుప్పకూలిన బంగారం ధరలు.. తాజా రేట్లు ఇవే