పశ్చిమాసియా మళ్లీ ఉద్రిక్తం.. ఇరాన్
Actor ProfilePolitician

పశ్చిమాసియా మళ్లీ ఉద్రిక్తం.. ఇరాన్

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
పశ్చిమాసియా మళ్లీ ఉద్రిక్తం.. ఇరాన్ పై విరుచుకుపడుతున్న అమెరికా
Zee Telugu5 Nov 2026
పశ్చిమాసియా మళ్లీ ఉద్రిక్తం.. ఇరాన్ పై విరుచుకుపడుతున్న అమెరికా

కిరణ్ కుమార్ శర్మ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాలు కూడా రాస్తుంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. America Iran War: మిడిల్ ఈస్ట్‌లో పరిస్థితులు మళ్లీ మొదటికొచ్చింది. ఇరు దేశాల మధ్య కుదిరిన శాంతి ఒప్పందాన్ని ఎవరు ఖాతరు చేయకుండా ఒకరిపై ఒకరు దాడుల చేసుకోవడంతో హార్మూజ్ సహా పశ్చిమాసియాలో తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి. మరోవైపు ఆదివారం ఇరాన్.. గల్ఫ్ దేశాల్లోని అమెరికా స్థావరాలపై విరుచు పడింది. ముఖ్యంగా హార్మూజ్‌లోని ఒమన్ తీరం దగ్గరలో ప్రయాణిస్తోన్న సైప్రస్‌కు చెందిన పతాకంతో వెళుతున్న దానిపై ఇరాన్‌కు చెందిన ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్స్ జీఎఫ్ఎస్ గెలాక్సీ అనే కమర్షియల్ షిప్ పై ఆదివారం దాడికి తెగపడింది. అందులో 24 మంది సిబ్బంది ఉన్నారు. అందులో 11 మంది మన దేశానికి చెందినవారున్నారు. ఓడలో ఉన్న స్టాఫ్‌లో 23 మందిని ఒమన్ రక్షించింది. ఓ భారతీయుడికి ఆచూకి మాత్రం లభించడం లేదు. ఐఆర్జీసీ బలగాల దాడితో సైప్రజ్ ఓడలోని ఇంజిన్ పూర్తిగా దెబ్బతిని ముందుకు కదలేని స్థితి నెలకొంది. ఇక ఐర్‌జీసీ దళాలు వాణిజ్య నౌకపై దాడిని మన దేశం ఖండించింది. మరోవైపు తాము హార్మూజ్ జలసంధిని తమ దిగ్బంధనంలో తీసుకున్నట్టు ప్రకటించారు. తమ అనుమతులు లేకుండా ఎలాంటి నౌకలను ఇక్కడ ప్రయాణించడానికి అనుమతించమని చెప్పుకొచ్చారు. మరోవైపు అమెరికా మాత్రం ఇరాన్ వ్యాఖ్యలను ఖండించింది. హార్మూజ్ జలసంధి తెరిచే ఉందని చెప్పింది. హర్మూజ్‌ సమీపంలోని తమ కెష్మ్‌ దీవిపై అమెరికా దాడులు నిర్వహించింది. అటు బందర్ అబ్బాస్ తీరం, ఛాబహార్ తీరంలోని వాచ్ టవర్స్‌ను ధ్వంసం చేసినట్టు తెలుస్తుంది