పవన్ కల్యాణ్ సమక్షంలో జనసేన పార్టీలో చేరిన విజయవాడ వ్యాపారవేత్త గుడిపాటి సీతారాం
Actor ProfilePolitician

పవన్ కల్యాణ్ సమక్షంలో జనసేన పార్టీలో చేరిన విజయవాడ వ్యాపారవేత్త గుడిపాటి సీతారాం

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
పవన్ కల్యాణ్ సమక్షంలో జనసేన పార్టీలో చేరిన విజయవాడ వ్యాపారవేత్త గుడిపాటి సీతారాం
AP7AM6 Oct 2026
పవన్ కల్యాణ్ సమక్షంలో జనసేన పార్టీలో చేరిన విజయవాడ వ్యాపారవేత్త గుడిపాటి సీతారాం

విజయవాడకు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త, బ్యాడ్మింటన్ క్రీడాకారుడు గుడిపాటి సీతారాం జనసేన పార్టీలో చేరారు. మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో మంగళవారం సాయంత్రం జరిగిన కార్యక్రమంలో జనసేన అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఆయనకు పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో సీతారాం భార్య, యువ గాయని శ్రీలలిత కూడా పాల్గొన్నారు.ఈ సందర్భంగా గుడిపాటి సీతారాం మాట్లాడుతూ, పవన్ కల్యాణ్ 'దేశమే ప్రథమం' అనే దృక్పథంతో పనిచేస్తున్నారని, ఆయన నాయకత్వ స్ఫూర్తితోనే తాను జనసేనలో చేరాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. పార్టీ సిద్ధాంతాలకు, పవన్ కల్యాణ్ ఆశయాలకు అనుగుణంగా శక్తివంచన లేకుండా కృషి చేస్తానని ఆయన స్పష్టం చేశారు.గుడిపాటి ఫౌండేషన్ ఛైర్మన్‌గా సీతారాం క్రీడలు, యువజన అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తున్నారు. రాష్ట్రస్థాయిలో బ్యాడ్మింటన్ టోర్నమెంట్లు నిర్వహిస్తూ క్రీడా రంగంలో తనదైన గుర్తింపు పొందారు. ఆయన చేరికతో కృష్ణా జిల్లాలో జనసేన పార్టీకి క్రీడా, వ్యాపార వర్గాల నుంచి మరింత మద్దతు లభిస్తుందని ఆ పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. సీతారాం పార్టీలో చేరడం పట్ల జనసేన శ్రేణులు, సోషల్ మీడియా వేదికగా అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు