
మాధవి లగిశెట్టి (భూమి).. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్ పనిచేస్తున్నారు. ఇక్కడ బిజినెస్, స్పోర్ట్స్, క్రైమ్, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. UGC NET 2026: యూజీసీ నెట్ 2026కు సంబంధించి ఇంగ్లీష్, కామర్స్, సోషియాలజీ పరీక్షలను మరోసారి నిర్వహించనున్నట్లు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఆదివారం ప్రకటించింది. ఈ సబ్జెక్టుల ప్రశ్న పత్రాల్లో పలు పొరపాట్లు దొర్లినట్లు ఫిర్యాదులు అందడంతో రీటెస్ట్ నిర్వహించేందుకు ఎన్టీఏ నిర్ణయించింది. ట్రాన్స్ లేషన్ దోషాలతో పాటు టైపో గ్రాఫికల్ , ఫ్యాక్చువల్ తప్పులు ఉన్నట్లు తమ పరిశీలనలో తేలిందని కూడా ఎన్టీఏ పేర్కొంది. ఈ నేపథ్యంలో కమిటీ సూచనల మేరకు 3 పేపర్లకు సంబంధించి రీటెస్టు నిర్వహిస్తున్నామని తెలిపింది. సెప్టెంబర్ 9న ఉదయం షిఫ్టులో ఇంగ్లీష్ పరీక్ష, మధ్యాహ్నం షిఫ్టులో కామర్స్ పరీక్షను నిర్వహించనున్నట్లు తెలిపింది. సెప్టెంబర్ 10వ తేదీన ఉదయం షిఫ్టులో సోషియాలజీ పరీక్ష నిర్వహిస్తున్నట్లు ఎన్టీఏ తెలిపింది. రీటెస్టుకు హాజరయ్యే వారు అదనపు ఫీజులేవి చెల్లించక్కర్లేదని ఎన్టీఏ పేర్కొంది. పరీక్ష కేంద్రం, అడ్మిట్ కార్డుల వివరాలన్నీ త్వరలోనే అధికారిక వెబ్ సైట్లో వెల్లడిస్తామని తెలిపింది. ఇక మిగిలిన 84 సబ్జెక్టుల ఫలితాలు మాత్రం యథావిధిగా విడుదల చేస్తామని కూడా తెలిపింది. ఈ ఏడాది జూన్ 22 నుంచి 30 మధ్య దేశవ్యాప్తంగా 87 సబ్జెక్టుల్లో యూజీసీ నెట్ పరీక్ష నిర్వహించిన సంగతి తెలిసిందే. జేఆర్ఎఫ్ ఫెలోషిప్, పీహెచ్‌డీ అడ్మిషన్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు అర్హత కోసం విద్యార్థులు ఈ పరీక్షలు రాస్తుంటారు. స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి