పద్మనాభం నా పెదనాన్న.. తెలిసినవాళ్లే మోసం చేయడంతో ఉన్న ఇల్లు కూడా అమ్మేశారు.. జబర్దస్త్ నటుడు
Actor ProfileActor

పద్మనాభం నా పెదనాన్న.. తెలిసినవాళ్లే మోసం చేయడంతో ఉన్న ఇల్లు కూడా అమ్మేశారు.. జబర్దస్త్ నటుడు

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
పద్మనాభం నా పెదనాన్న.. తెలిసినవాళ్లే మోసం చేయడంతో ఉన్న ఇల్లు కూడా అమ్మేశారు.. జబర్దస్త్ నటుడు
TV9 Telugu28 Oct 2026
పద్మనాభం నా పెదనాన్న.. తెలిసినవాళ్లే మోసం చేయడంతో ఉన్న ఇల్లు కూడా అమ్మేశారు.. జబర్దస్త్ నటుడు

తెలుగు సినిమా రంగంలో హాస్య నటుడిగా, దర్శకుడిగా, నిర్మాతగా తనదైన ముద్ర వేసిన నటులలో పద్మనాభం ఒకరు. దాదాపు ఆరు దశాబ్దాల సుధీర్ఘ సినీ ప్రయాణంలో 400 కంటే ఎక్కువ చిత్రాల్లో నటించి మెప్పించారు. ఆయన కామెడీ టైమింగ్, యాక్టింగ్ చూసి ప్రేక్షకులు తెగ ఎంజాయ్ చేసేవారు. ఒకప్పుడు అగ్ర నటుడిగా పేరు సంపాదించుకుని.. అత్యధిక పారితోషికం తీసుకున్న ఆయన.. చివరి రోజుల్లో మాత్రం నమ్మినవారే మోసం చేయడంతో ఆర్థిక సవాళ్లు ఎదుర్కోన్నారు. ఆయన తనయుడు ప్రస్తుతం సినిమాల్లో నటుడిగా కొనసాగుతున్నారు. అలాగే జబర్దస్త్ షోలోనూ తన నటనతో అలరించాడు. అతడు మరెవరో కాదు.. హాస్యనటుడు తిరుపతి ప్రకాష్. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన.. తన సినీ కెరీర్‌లో ఎదుర్కొన్న కష్టాలను, పాత్రల కొరతను వివరించారు. సీనియర్ నటుడు పద్మనాభం తన పెద్దనాన్న అని వెల్లడించిన ఆయన, పద్మనాభం చివరి రోజుల్లో ఆర్థికంగా ఎదుర్కొన్న ఇబ్బందులను కూడా పంచుకున్నారు. ఎక్కువ మంది చదివినవి :Tollywood : పెదరాయుడు సినిమా చిన్నోడు గుర్తున్నాడా.. ? ఇప్పుడు తెలుగులో క్రేజీ హీరో.. ఫోటోస్ చూశారా.. తిరుపతి మాట్లాడుతూ.. సీరియల్స్‌లో తండ్రి పాత్రలకు పరిమితం కావడంపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. "స్టార్ మాలో పల్లకిలో పెళ్లికూతురు సీరియల్‌లో ఫాదర్ క్యారెక్టర్ చేశా. కెమెరా, లైటింగ్, ప్రొడక్షన్ అన్నీ ఒకేలా ఉంటాయి. టీవీలో తండ్రి పాత్రను ఎంతో మంది ఆమోదించినప్పుడు, సినిమాలో నాకు తండ్రి వేషాలు ఇవ్వరు, స్నేహితుడి వేషాలు ఇవ్వరు, చిన్న క్యారెక్టర్లు కూడా ఇవ్వరు" అని తిరుపతి ప్రకాష్ అన్నారు. తాను గతంలో 24 గంటలలో 16 గంటలు మేకప్‌లో ఉండి, నెలలో 30-40 రోజులు షూటింగ్‌లలో పాల్గొన్నానని, డే అండ్ నైట్ షూటింగ్‌లు కూడా చేశానని ఆయన గుర్తు చేసుకున్నారు. ఎక్కువ మంది చదివినవి : Bigg Boss : బిగ్ బాస్‌లోకి యంగ్ హీరో భార్య.. వారానికి లక్షలకుపైనే రెమ్యునరేషన్.. ఫాలోయింగ్