
మాధవి లగిశెట్టి (భూమి).. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్ పనిచేస్తున్నారు. ఇక్కడ బిజినెస్, స్పోర్ట్స్, క్రైమ్, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. muttangi lake soil mining controversy: సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి.. తన మార్కు రాజకీయం చేయడంలో సక్సెస్ అయినప్పటికీ.. మైనింగ్ వ్యవహారంలో చెడ్డ పేరును మూటగట్టుకున్నారు. మైనింగ్ విషయంలో మైపాల్ రెడ్డి ఆయన సోదరుడు చేసిన అనాలోచిత పనులతో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ రంగంలోకి దిగి కోట్లలో పెనాల్టీ వేయాల్సి వచ్చింది.. అయితే మున్సిపల్ ఎన్నికల తర్వాత మళ్ళీ బిఆర్ఎస్ లో చేరి జోష్ మీద ఉన్న మహిపాల్ రెడ్డికి .. తాజాగా మట్టి మరక అంటున్నట్లు కనిపిస్తుంది. పటాన్‌చెరు నియోజకవర్గంలోని ముత్తంగి ఎల్కా చెరువులో నల్లమట్టి తరలింపు వ్యవహారం గూడెం మహిపాల్ రెడ్డికి రాజకీయంగా ఇబ్బందికరంగా మారుతోంది. చెరువు నుంచి నల్లమట్టి తరలింపునకు నీటిపారుదల శాఖ ఇచ్చిన అనుమతుల్లో కనీస నిబంధనలు లేకపోవడం, ఎమ్మెల్యే సిఫారసు మేరకే అనుమతులు మంజూరు చేసినట్లు అధికారులు పేర్కొనడం పలు అనుమానాలకు తావిస్తోంది. ఈ వ్యవహారంలో నిబంధనలను పూర్తిగా పక్కనపెట్టి మట్టి వ్యాపారికి అనుకూలంగా వ్యవహరించారని గ్రామస్తులు ఆరోపణలు చేస్తున్నారు. గ్రామస్తుల కథనం ప్రకారం, సాధారణంగా చెరువుల నుంచి మట్టి తరలింపునకు ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు మాత్రమే అనుమతి ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే మట్టి తరలింపు ఎన్ని రోజుల పాటు కొనసాగాలనే కాలపరిమితిని కూడా స్పష్టంగా పేర్కొనాలి.కానీ ముత్తంగి చెరువు విషయంలో జారీ చేసిన అనుమతి పత్రాల్లో ఈ రెండు కీలక అంశాలు ఎక్కడా ప్రస్తావించలేదని గ్రామస్తులు ఆగ్రహ వ్యక్తం చేస్తున్నారు. దీంతో పగలు, రాత్రి అనే తేడా లేకుండా నిరంతరం మట్టి తరలింపు జరుగుతోందని ఆరోపిస్తున్నారు. ఈ అంశంపై సంబంధిత అధికారులను ప్రశ్నించగా