
నేటితరంలో తగ్గిన పఠనాసక్తి సాంకేతికతకు అనుగుణంగా మారని గ్రంథాలయాలు నగరంలో ఒక్కటీ లేని డిజిటల్ లైబ్రరీ నేడు జాతీయ గ్రంథాలయ దినోత్సవం హైదరాబాద్ సిటీ: గ్రంథాలయాలు విజ్ఞాన భాండాగారాలంటారు. కళ్ల ముందు ప్రపంచాన్ని ఉంచుతుంది. ఆలోచనలను విశాలం చేస్తుంది. కొత్త మనిషిగా లోకానికి పరిచయం చేస్తుంది. మట్టికరిచిన మనిషిని సైతం పైకిలేపి నిలబెడుతుంది. ‘పుస్తకం మనిషిని ఉన్నతీకరిస్తుందని’ అంబేద్కర్ మహాశయుడు అందుకే అన్నాడేమో.! ఫేస్‌బుక్, ట్విట్టర్ ఖాతాలలో వేలకొద్దీ స్నేహితులున్నా దొరకని ఆత్మస్థైర్యాన్ని ఒక పుస్తకం ఇవ్వగలదు. ఓటీటీ, యూట్యూబ్‌లలో ఉర్రూతలూగించే వెబ్‌సిరీ్‌సలు చూసినా కలగని ఆనందాన్ని కూడా పుస్తకంతోనే పొందచ్చు. నగరంలో 83 పౌర గ్రంథాలయాలున్నాయి. ప్రతీ లైబ్రరీలో యువతీ, యువకుల సందోహమే! కాకపోతే వారంతా పోటీ పరీక్షలకు సన్నద్ధమవుతున్న విద్యార్థులు. ఈ తరంలో సాహిత్య పఠనాసక్తిని పెంపొందించడానికి మంచి అవకాశం. అయినా అందుకు నడుం కట్టేదెవ్వరు? అటెండర్లే గ్రంథ పాలకులు స్వాభిమాన పోరాటానికి దారి చూపిన గ్రంథాలయాలు ఈనాడు సోయి తప్పాయి. నగర గ్రంథాలయ సంస్థ పరిధిలోని పౌర గ్రంథాలయాలలో రెగ్యులర్ సిబ్బంది 21మంది మాత్రమే పనిచేస్తున్నారు. గ్రంథాలయాలను కొన్నిచోట్ల అటెండర్లు, స్వీపర్లే నిర్వహిస్తున్నారని చరిత్ర పరిశోధకుడు సంగిశెట్టి శ్రీనివాస్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కనీసంగా 60మంది లైబ్రేరియన్లనైనా ప్రభుత్వం నియమించడం ద్వారా మన జ్ఞాన భాండాగారాల స్ఫూర్తి నిలుస్తుందన్నది నిపుణుల అభిప్రాయం. కార్పొరేట్ సామాజిక బాధ్యత కింద కొండాపూర్‌లో కోఫోర్జ్ లైబ్రరీ నగరంలో కొత్త సంస్కృతికి నాంది పలికింది. తెలుగు, హిందీ, ఇంగ్లిషులో 15వేలకుపైగా పుస్తకాలతో ఉదయం నుంచి సాయంత్రం వరకు 365రోజులూ పాఠకులకు ఐటీ కారిడార్‌లోని ఆ గ్రంథాలయం ఆహ్వానం పలుకుతోంది. యువత, పిల్లలు ఈ బుక్స్, ఆడియో పుస్తకాలకన్నా అచ్చు పుస్తకాలు చదవడానికే అమితాసక్తి కనబరుస్తున్నారనడానికి కోఫోర్జ్ లైబ్రరీతో పాటు హైదరాబాద్ బుక్‌ఫెయుర్, హైదరాబాద్ లిటరరీ ఫెస్టివల్స్‌కు యువత నుంచి లభిస్తున్న ఆదరణే నిదర్శనం. ఏఐ యుగంలో లైబ్రరీ విశ్వనగరంగా ఖ్యాతికెక్కిన హైదరాబాద్‌లో ఒక్కటీ పూర్తి స్థాయి