
ఇంటర్నెట్‌డెస్క్: జమ్మూకశ్మీర్‌కు ప్రత్యేక హోదా కల్పించిన ఆర్టికల్ 370 రద్దు గురించి స్వాతంత్ర్య వేడుకల్లో ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా (Omar Abdullah) ప్రస్తావించారు. ఈ ప్రత్యేక హోదాను కేంద్రం రద్దు చేయకపోయి ఉంటే.. జమ్మూకశ్మీర్‌లో విలీనం అయ్యేందుకు పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని ప్రజలు తిరుగుబాటు చేసేవారని అన్నారు. ‘‘1947లో పాకిస్థానీ దురాక్రమణదారులకు వ్యతిరేకంగా కశ్మీర్ ప్రజలు పోరాడారు. ఇప్పుడు సరిహద్దుల్లో పరిస్థితులను చూసినప్పుడు.. మన పూర్వీకులు చెప్పిన మాట నిజమని అర్థమవుతోంది. ‘దాడికి దిగాలనుకునేవారికి హెచ్చరిక.. మీకు బుద్ధి చెప్పేందుకు కశ్మీరీలం అయిన మేం సిద్ధంగా ఉన్నాం’ అని వారు చెప్పారని గుర్తుచేసుకున్నారు. ప్రస్తుతం పాక్ ఆక్రమిత కశ్మీర్ (POK)లోని ప్రజల పరిస్థితి చూస్తుంటే.. బాధగా ఉంది. రాష్ట్ర హోదా, ప్రత్యేక హోదా రద్దు చేయకపోయి ఉంటే.. తమను తిరిగి జమ్మూకశ్మీర్‌లో విలీనం చేయమని పీఓకే ప్రజలు తిరుగుబాటు చేసేవారని నేను భావిస్తున్నాను. వారికోసం మనం అసెంబ్లీలో సీట్లు ఖాళీగా ఉంచుతున్నాం. ఏదో ఒకరోజు ఆ సీట్లు నిండుతాయన్న ఆశతో ఉన్నాం’’ అని అబ్దుల్లా అన్నారు. జమ్మూకశ్మీర్‌కు రాష్ట్రహోదా పునరుద్ధరించేవరకు తమ పోరాటం కొనసాగుతుందని చెప్పారు. భాజపా ఈ వ్యాఖ్యలను ఖండించింది. ‘‘ముఖ్యమంత్రి బాధ్యతారాహిత్యంగా మాట్లాడారు. ఈ స్వాతంత్ర్య దినోత్సవం రోజున ఆయన రాజకీయాలు చేస్తున్నారు. భవిష్యత్ ప్రణాళికలు మాట్లాడాల్సిన ఈ వేదికను ఆయన రాజకీయాలకు వాడుకున్నారు’’ అంటూ జమ్మూకశ్మీర్ అసెంబ్లీలో ప్రతిపక్ష నేత, భాజపా నాయకుడు సునీల్ శర్మ దుయ్యబట్టారు. గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు. 80వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని