పెళ్లయిన ఏడేళ్లలోపు చనిపోతే కట్నం చావే
Actor ProfilePolitician

పెళ్లయిన ఏడేళ్లలోపు చనిపోతే కట్నం చావే

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
పెళ్లయిన ఏడేళ్లలోపు చనిపోతే కట్నం చావే
Sakshi18 Nov 2026
పెళ్లయిన ఏడేళ్లలోపు చనిపోతే కట్నం చావే

లక్నో: కట్నం వేధింపుల కారణంగా చోటుచేసుకునే మహిళల మరణాలపై అలహాబాద్‌ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. మహిళ వివాహమైన ఏడేళ్లలోపు మరణించి, కట్నం వేధింపులకు గురైనట్లు ఆధారాలుంటే దానిని కట్నం వేధింపుల మరణంగా పరిగణించవచ్చని తెలిపింది. ఇందుకు భర్త లేదా అత్తమామల ప్రత్యక్ష ప్రమేయం ఉందనేందుకు ఆధారాలు చూపాల్సిన అవసరం కూడా లేదని స్పష్టం చేసింది. ఇందుకు సంబంధించిన కేసులో ఓ వ్యక్తికి దిగువ కోర్టు విధించిన జీవిత ఖైదును పదేళ్లకు తగ్గిస్తూ తీర్పు వెలువరించింది. లక్నోలోని తల్కటోరా పోలీస్‌ స్టేషన్‌ ప్రాంతానికి చెందిన ఓ మహిళ అత్తింట్లో అనుమానాస్పద పరిస్థితుల్లో చనిపోయింది. ఇందుకు కట్నం వేధింపులే కారణమంటూ ఆమె భర్త హోరాకు 2010లో దిగువ కోర్టు కఠిన జీవితా కారాగారం విధించింది. ఈ శిక్షను హోరా హైకోర్టులో సవాల్‌ చేశారు. విచారణ సమయంలో హైకోర్టు పైవిధంగా వ్యాఖ్యానించింది. ‘పిటిషనర్‌కు భార్య మరణంతో సంబంధం ఉందనేందుకు స్పష్టమైన ఆధారాలు లేనంత మాత్రాన, కట్నం చావు కేసు కాకుండా పోదు. అదే సమయంలో, పిటిషనర్‌కు గరిష్ట శిక్ష అయిన జీవిత ఖైదు విధించడానికి ట్రయల్‌ కోర్టు బలమైన కారణాలను చూపడంలో విఫలమైంది. ఇది తీవ్రమైన లేదా అరుదైన కేసుల పరిధిలోకి కూడా కాదు. హోరా ఇప్పటికే ఆరేళ్లకుపైగా జైలు శిక్ష అనుభవించారు. జైలు జీవితంలో అతడి సత్ప్రవర్తనను పరిగణనలోకి తీసుకుంటూ శిక్షా కాలాన్ని తగ్గిస్తున్నాం’అని పేర్కొంది. ప్రెగ్నెన్సీతో సమంత.. ఆగస్టు ఎనర్జీతో ఇలా (ఫొటోలు) వేశ్య పాత్రలో అదరగొట్టిన వామికా గబ్బి.. ఈ బ్యూటీ బ్యాగ్‌గ్రౌండ్‌ తెలుసా? (ఫొటోలు) సూర్య ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ మూవీ HD స్టిల్స్ హైదరాబాద్ : అమ్మవారికి బంగారు బోనం సమర్పించిన కొణిదెల నిహారిక .. ఫొటోలు వైరల్ హైదరాబాద్ లో సందడి చేసిన ‘కాంతారా’ ఫేమ్‌ రుక్మిణి వసంత్‌ (ఫొటోలు) నువ్వు బిరియాని కనిపెడితే ఇరానీలు ఏం చేసినట్లు? బాబుపై బుగ్గన సెటైర్లే సెటైర్లు షూస్ వేసుకొని వెంకన్న