పెళ్లి.. పిల్లలు.. వేల పాటలు.. ఎస్.జానకి జీవితంలో తెలియని విశేషాలు
Actor ProfilePolitician

పెళ్లి.. పిల్లలు.. వేల పాటలు.. ఎస్.జానకి జీవితంలో తెలియని విశేషాలు

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
పెళ్లి.. పిల్లలు.. వేల పాటలు.. ఎస్.జానకి జీవితంలో తెలియని విశేషాలు
NTV Telugu1 Nov 2026
పెళ్లి.. పిల్లలు.. వేల పాటలు.. ఎస్.జానకి జీవితంలో తెలియని విశేషాలు

S Janaki: గుంటూరు జిల్లా రేపల్లె తాలూకాలోని పల్లపట్ల గ్రామంలో 1938 ఏప్రిల్ 23న శ్రీరామమూర్తి, సత్యవతి దంపతులకు ఎస్.జానకి జన్మించారు. 19 ఏళ్ల వయసులో తన మామయ్య సూచన మేరకు చెన్నై చేరుకున్న జానకి, ప్రముఖ ఏవీఎం (AVM) స్టూడియోలో గాన ప్రస్థానాన్ని ప్రారంభించారు. అనంతరం ఆమె – వి.రామ్‌ప్రసాద్‌ను వివాహం చేసుకుని చెన్నైలో స్థిరపడ్డారు. ఈ దంపతులకు మురళీకృష్ణ అనే కుమారుడు ఉన్నారు. భరతనాట్యంలో ప్రావీణ్యం పొందిన మురళీకృష్ణ తెలుగు, మలయాళ చిత్రాల్లో కూడా నటించారు. తెలుగులో వినాయకుడు, మల్లెపువ్వు చిత్రాల ద్వారా ప్రేక్షకులకు పరిచయమైన ఆయన 2026 జనవరి 22న తన 65 ఏళ్ల వయసులో కన్నుమూశారు. అంతకుముందే తన తండ్రి రామ్‌ప్రసాద్ కూడా 1990లలో మరణించారు. జానకి సినీ ప్రస్థానం ఏవీఎం (AVM) స్టూడియోలో గాయనిగా ప్రారంభమైంది. 1957లో టి.చలపతిరావు సంగీత దర్శకత్వంలో తెరకెక్కిన తమిళ చిత్రం ‘విధియిన్ విలాయట్టు’ ద్వారా ఆమె సినీ రంగంలోకి అడుగుపెట్టారు. అనంతరం ‘ఎమ్మెల్యే’ చిత్రంలోని పాటతో తెలుగు ప్రేక్షకులకు చేరువై, తన ప్రత్యేక గాత్రంతో గుర్తింపు పొందారు. ఆ తర్వాత తెలుగు, తమిళం, మలయాళం, కన్నడతో పాటు పలు భారతీయ భాషల్లో వేలాది పాటలు పాడి భారతీయ సినీ సంగీతంలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకొని సుస్థిరం చేసుకున్నారు. నేపథ్య గాయనిగానే కాకుండా పాటల రచయిత్రి, కర్ణాటక సంగీత విద్వాంసురాలు, సంగీత దర్శకురాలిగానూ జానకి తన ప్రతిభను చాటుకున్నారు. ఉషా కిరణ్ మూవీస్ నిర్మించిన ‘మౌన పోరాటం’ చిత్రానికి సంగీతం అందించి, భానుమతి, లీల తర్వాత సంగీత దర్శకురాలిగా గుర్తింపు పొందిన అరుదైన మహిళల్లో ఒకరిగా నిలిచారు. శ్రీకృష్ణుడు, షిర్డీ సాయిబాబాపై అపార భక్తి కలిగిన ఆమె భక్తి గీతాల ఆల్బమ్‌లను కూడా రిలీజ్ చేశారు. తన గాత్ర వైవిధ్యం జానకిని ఇతర గాయనుల నుంచి ప్రత్యేకంగా నిలబెట్టింది. ఒకే పాటలో చిన్నారి, వృద్ధురాలు, యువతి వంటి విభిన్న స్వరాలను పలికిస్తూ