పెళ్లి చేసుకున్న పోర్చుగ ల్ ఫుట్ బాల్ స్టార్ క్రిస్టియానో రొనాల్డో
Actor ProfileActor

పెళ్లి చేసుకున్న పోర్చుగ ల్ ఫుట్ బాల్ స్టార్ క్రిస్టియానో రొనాల్డో

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
పెళ్లి చేసుకున్న పోర్చుగ ల్ ఫుట్ బాల్ స్టార్ క్రిస్టియానో రొనాల్డో
10TV Telugu7 Dec 2026
పెళ్లి చేసుకున్న పోర్చుగ ల్ ఫుట్ బాల్ స్టార్ క్రిస్టియానో రొనాల్డో

Cristiano Ronaldo : పోర్చుగల్‌ ఫుట్‌బాల్‌ స్టార్‌ క్రిస్టియానో రొనాల్డో తన చిరకాల భాగస్వామి, మోడల్‌, ఇన్‌ఫ్లుయెన్సర్‌ జార్జినా రోడ్రిగెజ్‌ను వివాహం చేసుకున్నారు. మంగళవారం (ఆగస్టు 11) పోర్చుగల్‌లో జరిగిన సివిల్‌ వేడుకలో వీరిద్దరూ ఒక్కటయ్యారు. పెళ్లి ఉంగ‌రాల‌తో ఉన్న త‌మ చేతుల ఫోటోల‌ను పోస్ట్ చేస్తూ ఈ విష‌యాన్ని సోష‌ల్ మీడియా వేదిక‌గా రొనాల్డో వెల్ల‌డించాడు. అత‌డి పేరులోని మొద‌టి అక్ష‌రం సి.. జార్జినా పేరులోని జే అక్ష‌రాల మ‌ధ్య ల‌వ్ సింబ‌ల్‌ను క్యాప్ష‌న్‌గా ఇచ్చాడు. రొనాల్డోకు 41 ఏళ్లు కాగా జార్జినా రోడ్రిగెజ్‌కు 32 సంవ‌త్స‌రాలు. Sara Tendulkar : స‌చిన్ కూతురు మోడ‌లింగ్ చేస్తోందా? సారా టెండూల్క‌ర్ మోడ్ర‌న్ ఫోటోలు వైర‌ల్.. అర్జెంటీనా-స్పానిష్ మోడ‌ల్ అయిన జార్జినా రోడ్రిగెజ్‌తో రొనాల్డో ప‌దేళ్లుగా రిలేష‌న్‌షిప్‌లో ఉన్నారు. గ‌తంలో వీరిద్ద‌రి పెళ్లిపై చాలా రూమ‌ర్లు రాగా.. ఎప్ప‌టిక‌ప్పుడు వాటిని కొట్టిపారేశారు. వీరిద్ద‌రు తొలిసారి 2016లో క‌లుసుకున్నారు. స్పెయిన్‌ దిగ్గజ క్లబ్‌ రియల్‌ మాడ్రిడ్‌ తరఫున రొనాల్డో ఆడుతున్న సమయంలో మాడ్రిడ్‌లోని ఓ గూచీ స్టోర్‌లో పనిచేస్తున్న జార్జినాను తొలిసారి క‌లిశాడు. ఆ పరిచయం క్రమంగా ప్రేమగా మారింది. త‌మ ప్రేమ బంధాన్ని మ‌రుస‌టి ఏడాదే బాహ్య ప్ర‌పంచానికి తెలిసేలా ప్ర‌క‌టించాడు. జార్జినా నటించిన నెట్‌ఫ్లిక్స్‌ సిరీస్‌ I Am Georginaలో రొనాల్డో తమ ప్రేమ గురించి ఆసక్తికర విషయాలను వెల్లడించారు. తొలుత తమ బంధం ఇంత బలంగా మారుతుందని, తాను ఆమెతో ప్రేమలో పడతానని ఊహించలేదని చెప్పారు. రాను రాను త‌మ మ‌ధ్య బంధం చాలా బ‌ల‌ప‌డింద‌ని, త‌నే జీవిత భాగ‌స్వామి అని భావించిన‌ట్లు తెలిపాడు. రొనాల్డో, జార్జినా గత ఏడాది ఆగస్టు 11న తమ నిశ్చితార్థాన్ని ప్రకటించారు. జార్జినా అప్పట్లో పెద్ద ఉంగరం ధరించిన ఫొటోను సోషల్‌ మీడియాలో షేర్‌ చేస్తూ.. ‘అవును.. ఈ జీవితంలోనే కాదు, నా అన్ని జీవితాల్లోనూ’ అనే అర్థం వచ్చేలా స్పానిష్‌లో పోస్ట్‌ చేశారు. ఈ