పెళ్లి కాకముందే పిల్లలు..కృతి తీసుకున్న షాకింగ్ నిర్ణయం
Actor ProfileActor

పెళ్లి కాకముందే పిల్లలు..కృతి తీసుకున్న షాకింగ్ నిర్ణయం

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
పెళ్లి కాకముందే పిల్లలు..కృతి తీసుకున్న షాకింగ్ నిర్ణయం
Zee Telugu4 Oct 2026
పెళ్లి కాకముందే పిల్లలు..కృతి తీసుకున్న షాకింగ్ నిర్ణయం

Kriti Sanon:నటి కృతి సనన్ ఇటీవల తన జీవితంలో తీసుకున్న ఒక ముఖ్యమైన నిర్ణయం గురించి మొదటిసారిగా ఓపెన్‌గా మాట్లాడింది. పెళ్లి, పిల్లల గురించి సమాజం నుంచి వచ్చే ఒత్తిడికి తాను లోనవ్వకూడదనే ఉద్దేశంతో కొన్ని సంవత్సరాల క్రితమే తన ఎగ్స్‌ను ఫ్రీజ్ చేయించుకున్నట్లు వెల్లడించింది. ఈ విషయాన్ని ఆమె తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో పంచుకుంది. కృతి మాట్లాడుతూ "మనకు ఒక్క జీవితమే ఉంటుంది. మనకు నచ్చిన విధంగా జీవించే హక్కు మనదే. మన జీవిత కథను మనమే రాసుకోవాలి. మరెవరూ రాయకూడదు" అని చెప్పింది. పెళ్లి చేసుకోవాలా, పిల్లలను కనాలా అనే నిర్ణయం వయసు చూసి కాకుండా, మనసు సిద్ధమైనప్పుడు తీసుకోవాలని ఆమె అభిప్రాయపడింది. తాను ఈ నిర్ణయం 'మిమి' సినిమా షూటింగ్‌కు ముందు తీసుకున్నట్లు కృతి తెలిపింది. ఆ సినిమాలో సరోగసీ తల్లి పాత్ర కోసం దాదాపు 15 కిలోల బరువు పెరగాల్సి వచ్చింది. ఆ సమయంలో రెండు నెలల పాటు షూటింగ్ లేకపోవడంతో అదే సరైన సమయమని భావించి ఎగ్స్ ఫ్రీజింగ్ చేయించుకున్నానని చెప్పింది. ఈ ప్రక్రియ అంత సులభం కాదని కూడా కృతి వెల్లడించింది. హార్మోన్ ఇంజెక్షన్ల వల్ల శారీరకంగా, మానసికంగా చాలా మార్పులు వస్తాయని వివరించింది. "ఒక దశలో హార్మోన్ల ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది. గర్భిణిలా అనిపిస్తుంది. మూడ్ స్వింగ్స్ కూడా ఎక్కువగా ఉంటాయి" అని ఆమె చెప్పింది. అయితే ఈ కష్టాలన్నింటి తర్వాత కూడా తన నిర్ణయంపై ఎలాంటి పశ్చాత్తాపం లేదని కృతి స్పష్టం చేసింది. "ఇది అంత ఈజీ ప్రాసెస్ కాదు. కానీ విలువైన నిర్ణయం" అని ఆమె పేర్కొంది. భవిష్యత్తులో ఆ ఎగ్స్‌ను ఉపయోగిస్తానో లేదో తెలియదని, కానీ అవసరమైతే ఒక అవకాశం ఉండటం తనకు మానసిక ప్రశాంతతను ఇచ్చిందని చెప్పింది. ఎగ్స్ ఫ్రీజింగ్ అనేది మహిళల సంతానోత్పత్తి సామర్థ్యాన్ని భవిష్యత్తు కోసం భద్రపరిచే వైద్య ప్రక్రియ. ఇందులో హార్మోన్ ఇంజెక్షన్ల