టాలీవుడ్ హీరో నవీన్ పోలిశెట్టి సినిమాల్లో ఎంటర్టైన్మెంట్ కి కొదువ ఉండదు. కంటెంట్ తో పాటుగా కావాల్సినంత కామెడీని పంచుతారు. తనదైన కామెడీ టైమింగ్ తో ప్రేక్షకులను పొట్టచెక్కలయ్యేలా నవ్విస్తారు. బిగ్ స్క్రీన్ పై నవ్వులు పూయించే నవీన్.. రియల్ లైఫ్ లోనూ అంతే సరదాగా ఉంటారు. అందరితో చాలా జోవియల్ గా ఉండే పోలిశెట్టి.. ఎలాంటి సిచ్యుయేషన్ లో అయినా వినోదాన్ని పంచుతుంటారు. ఏదైనా పెళ్లికి వెళ్లినా, రిసెప్షన్ లో పాల్గొన్నా.. సినిమా ఈవెంట్ చేసినా.. తన మార్క్ ఎంటర్టైన్మెంట్ మాత్రం మిస్ కాకుండా చూసుకుంటారు. ఇప్పుడు తాజాగా తన మాటలతో పోలీసులను నవ్వించారు నవీన్.మల్కాజ్‌గిరి పోలీస్ కమిషనరేట్ ఆధ్వర్యంలో 5వ తెలంగాణ పోలీస్ గేమ్స్ & స్పోర్ట్స్ మీట్ ఘనంగా ప్రారంభమైంది. దీనికి నవీన్ పోలిశెట్టి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. తన స్పీచ్ తో అందరినీ ఆకట్టుకున్నారు. మల్కాజ్‌గిరి సీపీ సుమతి ఇటీవల మహిళా భద్రతపై దిల్‌సుఖ్‌నగర్‌లో చేసిన అండర్ కవర్ ఆపరేషన్ వీడియో వైరల్ అయిన సంగతి తెలిసిందే. దీనిపై నవీన్ ప్రశంసలు కురిపించారు. మేడమ్ చాలా బాగా నటించారని, తన సినిమాలో కూడా ఆమె ఒక పాత్ర చేయాలంటూ సరదాగా వ్యాఖ్యానించారు. సీపీ సుమతితో కలిసి 'ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ' సీక్వెల్ లో కేస్ సాల్వ్ చేయాలనేది తన కోరిక అన్నారు. ''సార్.. నాకు గన్ ఎలా పట్టుకోవాలో కాస్త నేర్పించండి'' అని హైదరాబాద్ సీపీ సజ్జనార్ ను కోరారు నవీన్ పొలిశెట్టి. ఇంతలో డీజీపీ సీవీ ఆనంద్ జోక్యం చేసుకుని.. ‘గన్ ట్రైనింగ్ ఓకే కానీ, ఒరిజినల్ బుల్లెట్లతో కాదు సుమా’ అంటూ సరదాగా ఛలోక్తులు విసిరారు. దానికి నవీన్ పొలిశెట్టి రియాక్ట్ అవుతూ.. ''మా సినిమాల్లో అన్నీ ఫేక్ బుల్లెట్లే ఉంటాయి సార్.. అయినా నాకు కనీసం గన్ ఎత్తడం కూడా రాదు'' అని అమాయకంగా అనడంతో అక్కడున్న పోలీసులందరూ ఒక్కసారిగా పగలబడి నవ్వారు
Actor ProfileActor
పోలీసాఫీసర్ పాత్రలో నవీన్ పోలిశెట్టి.. సీపీ సుమతికి జాతిరత్నం’ రిక్వెస్ట్.. వీడియో వైరల్
📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
Samayam Telugu•16 Oct 2026
పోలీసాఫీసర్ పాత్రలో నవీన్ పోలిశెట్టి.. సీపీ సుమతికి జాతిరత్నం’ రిక్వెస్ట్.. వీడియో వైరల్