పోలీస్ అభ్యర్థులకు శుభవార్త.. వయోపరిమితి పెంపు.. సర్కార్ ఉత్తర్వులు జారీ
Actor ProfilePolitician

పోలీస్ అభ్యర్థులకు శుభవార్త.. వయోపరిమితి పెంపు.. సర్కార్ ఉత్తర్వులు జారీ

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
పోలీస్ అభ్యర్థులకు శుభవార్త.. వయోపరిమితి పెంపు.. సర్కార్ ఉత్తర్వులు జారీ
10TV Telugu21 Dec 2026
పోలీస్ అభ్యర్థులకు శుభవార్త.. వయోపరిమితి పెంపు.. సర్కార్ ఉత్తర్వులు జారీ

Telangana Police Jobs Age Limit Relaxation : తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి సారథ్యంలో కొనసాగుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో పోలీస్, యూనిఫామ్ సర్వీసుల ఉద్యోగాలకోసం సిద్ధమవుతున్న అభ్యర్థులకు శుభవార్త చెప్పింది. ఉద్యోగ నియామకాల్లో వయోపరిమితిని మరోసారి సడలిస్తూ కీలక ఉత్తర్వులు జారీ చేసింది. తాజా నిర్ణయంతో వయోపరిమితి కారణంగా ఉద్యోగ అవకాశాలు కోల్పోతున్న అభ్యర్థులకు మరో అవకాశం లభించనుంది. ప్రభుత్వం ఉత్తర్వుల ప్రకారం.. పోలీస్ కానిస్టేబుల్ పోస్టులకు గరిష్ఠ వయోపరిమితి 34ఏళ్లుగా.. సబ్ ఇన్‌స్పెక్టర్ (ఎస్ఐ) పోస్టులకు 37ఏళ్లుగా నిర్ణయించింది. ప్రభుత్వం తాజా ఉత్తర్వులతో పోలీస్ ఉద్యగాలకోసం సిద్ధమవుతున్నవారికి ప్రయోజనం కలగనుంది. పోలీస్ శాఖతోపాటు ఇతర యూనిఫామ్ సర్వీసుల ఉద్యోగాలకూ ప్రభుత్వం ఈ వయోపరిమితి సడలింపును వర్తింపజేయనుంది. ఫైర్ సర్వీసెస్, జైళ్ల శాఖ, ఎస్పీఎఫ్, ఎక్సైజ్, ఫారెస్ట్ తదితర విభాగాల్లోని పోస్టులకు కూడా ఈ నిబంధనలు వర్తించనున్నట్లు ప్రభుత్వం పేర్కొంది. అయితే, ఇప్పటికే ఇచ్చిన సడలింపులతో కలిపి అభ్యర్థులకు మొత్తంగా ఏడేళ్ల అదనపు వయోపరిమితి అందుబాటులోకి వచ్చినట్లయింది. దీంతో వయోపరిమితి దాటిన కారణంగా ఉద్యోగ నోటిఫికేషన్లకు దూరమైన అభ్యర్థులు మరోసారి పోటీ పడే అవకాశం పొందనున్నారు. ప్రభుత్వ తాజా నిర్ణయంపై పోలీస్ ఉద్యోగ అభ్యర్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. వయోపరిమితి సడలింపు కోసం చాలాకాలంగా ఎదురుచూస్తున్న అభ్యర్థులకు ఈ నిర్ణయం ఊరటనిచ్చింది. రాబోయే పోలీస్, ఇతర యూనిఫామ్ సర్వీసుల నియామకాల్లో ఈ నిబంధనలు కీలకంగా మారనున్నాయి