ప ల్ల బురుసుకి బాలీవుడ్ డైరెక్ట ర్ ప్ర శంస లు
Actor ProfileCelebrity

ప ల్ల బురుసుకి బాలీవుడ్ డైరెక్ట ర్ ప్ర శంస లు

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
ప ల్ల బురుసుకి బాలీవుడ్ డైరెక్ట ర్ ప్ర శంస లు
Telugu Times7 Jan 2027
ప ల్ల బురుసుకి బాలీవుడ్ డైరెక్ట ర్ ప్ర శంస లు

టాలీవుడ్ లో తాజాగా ప్రేక్షకుల ముందుకొచ్చిన పల్లబురుసు(Pallaburusu) సినిమాకు ప్రముఖ డైరెక్ట‌ర్ అనురాగ్ కశ్యప్(Anurag Kashyap) నుంచి ప్రశంసలు దక్కాయి. సాధారణమైన కథనంతో, ఎమోష‌న్స్ ను సహజంగా ఆవిష్కరిస్తూ రూపొందిన ఈ సినిమా తనను ఆకట్టుకుందని ఆయన పేర్కొన్నారు. సినిమాకు ఫైవ్ స్టార్ రేటింగ్ ఇచ్చిన అనురాగ్.. ప్రస్తుత కమర్షియల్ సినిమాల మూసకు భిన్నంగా ఈ సినిమా ఉండటాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఈ సినిమాలోని సింప్లిసిటీ, హ్యూమన్ ఎమోషన్స్ ప్రేక్షకుల ముఖంపై చిరునవ్వు తీసుకొచ్చేలా ఉన్నాయని అనురాగ్ కశ్యప్ అభిప్రాయపడ్డారు. ఒకే తరహా యాక్షన్ సినిమాలు వరుసగా వస్తున్న టైమ్ లో ఇలాంటి రిఫ్రెషింగ్ కథనం చూడటం ఆనందంగా ఉందని తెలిపారు. గతంలో కేరాఫ్ కంచరపాలెం(C/O Kancharapalem) వంటి విభిన్నమైన సినిమాలతో మెప్పించిన డైరెక్ట‌ర్ల‌ తరహాలోనే ఉద‌య్ చౌహాన్‌పై కూడా తాను ఆసక్తి పెంచుకున్నానని ఆయన తన ప్రశంసల ద్వారా చెప్పకనే చెప్పారు. అనురాగ్ కశ్యప్ వంటి ప్రముఖ డైరెక్ట‌ర్ నుంచి వచ్చిన ఈ రెస్పాన్స్ పల్లబురుసు టీమ్‌కు మరింత ఉత్సాహాన్ని ఇచ్చే అంశంగా మారింది. డైరెక్ట‌ర్ ఉద‌య్ చౌహాన్(Uday Chauhan) తెరకెక్కించిన ఈ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌కు ప్రేక్షకుల నుంచి కూడా మంచి రెస్పాన్స్ లభిస్తోంది. అన్నపూర్ణ స్టూడియోస్(Annapurna Studios), ఎపిక్ స్టూడియోస్(Epic Studios) సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాలో కథనం, నటీనటుల పెర్ఫార్మెన్స్‌తో పాటు పవన్ సి(Pawan C) అందించిన మ్యూజిక్ కూడా ఆకట్టుకుంటున్నట్లు సినీ వర్గాలు చెబుతున్నాయి