
ప్రభుత్వ ఆసుపత్రుల్లో డాక్టర్ల కొరత ప్రైవేటును ఆశ్రయిస్తున్న గర్భిణులు విజయవాడ పాతాసుపత్రి, నందిగామ, జగ్గయ్యపేట గ్రామీణం, తిరువూరు, మైలవరం - న్యూస్‌టుడే జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాలకు అనువైన పరిస్థితులు అంతంతమాత్రంగానే ఉన్నాయి. సాధారణ ప్రసవం చేయడానికి వైద్యులు ప్రయత్నిస్తున్నా.. కొన్నిసార్లు సిజేరియన్ అవసరం పడుతోంది. అందుకు తగ్గ వసతులు ఉన్నా.. మత్తు వైద్యులు, సర్జన్లు ఉండడం లేదు. చేసేది లేక విజయవాడ పంపిస్తున్నారు. మత్తు, శస్త్రచికిత్స వైద్యులు ఉన్నారా....?లేరు జనవరి- జులై వరకు ఎన్ని ప్రసవాలు చేశారు...? 75 అత్యవసరంగా గర్భిణి వస్తే చికిత్స అందుతుందా? అందదు ఇంకా ఇతర సమస్యలున్నాయా...? సర్జన్, గైనకాలజిస్టు, మత్తు వైద్యులు లేరు. మైలవరం నుంచి గైనకాలజిస్టు వారానికి రెండు రోజులు వస్తున్నారు. మత్తు వైద్యుడిని బయటి నుంచి తీసుకొస్తున్నారు. మరికొందరు ప్రైవేటు ఆసుపత్రులను ఆశ్రయిస్తున్నారు. ఆసుపత్రి స్థాయి : సామాజిక ఆరోగ్యం కేంద్రం మత్తు, శస్త్రచికిత్స వైద్యులు ఉన్నారా....?ఉన్నారు జనవరి- జులై వరకు ఎన్ని ప్రసవాలు చేశారు...? 121 అత్యవసరంగా గర్భిణి వస్తే చికిత్స అందుతుందా? అందుతుంది ఇంకా ఇతర సమస్యలున్నాయా...? ఇద్దరు గైనకాలజిస్టులకు గాను ఒకరే ఉన్నారు. కాన్పులు పెరిగితే మరో వార్డు అవసరం ఉంటుంది. భవనం కావాలి. ప్రసవాలకు వసతులు ఉన్నాయా?మాతాశిశు సంక్షేమ విభాగాలున్నాయి. ఆసుపత్రికి ఉమ్మడి కృష్ణా, గుంటూరు, తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలు, తెలంగాణలోని ఖమ్మం, మధిర ప్రాంతాల నుంచి ప్రసవాలకు గర్భిణులు వస్తారు. మత్తు, శస్త్రచికిత్స వైద్యులు ఉన్నారా....?ఉన్నారు. సాధారణ ప్రసవాలకే వైద్యులు ప్రయత్నిస్తున్నారు. కుదరని పక్షంలో సిజేరియన్ చేస్తున్నారు. జనవరి- జులై వరకు ఎన్ని ప్రసవాలు చేశారు...? మొత్తం 4100 చేశారు. అందులో 3200 సిజేరియన్లు అత్యవసరంగా గర్భిణి వస్తే చికిత్స అందుతుందా? అందుతుంది. ఇంకా ఇతర సమస్యలున్నాయా...? కొంతమంది ప్రైవేటు ఆసుపత్రులను ఆశ్రయించి వ్యయప్రయాసలకు గురవుతున్నారు. ఉన్నతాధికారులు స్పందించి సమస్యలు పరిష్కరించాలని ప్రజలు కోరుతున్నారు. మత్తు, శస్త్రచికిత్స వైద్యులు ఉన్నారా....?మత్తు వైద్యుడు ఉన్నారు. సర్జన్ లేరు