ప్రశ్న రావణ్ మాట్లాడిన వీడియోలు చూశాను.. ఎవరినీ కించపరచలేదు
Actor ProfilePolitician

ప్రశ్న రావణ్ మాట్లాడిన వీడియోలు చూశాను.. ఎవరినీ కించపరచలేదు

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
ప్రశ్న రావణ్ మాట్లాడిన వీడియోలు చూశాను.. ఎవరినీ కించపరచలేదు
Samayam Telugu8 Oct 2026
ప్రశ్న రావణ్ మాట్లాడిన వీడియోలు చూశాను.. ఎవరినీ కించపరచలేదు

యూట్యూబర్‌ ప్రశ్న రావణ్‌‌పై దేశ ద్రోహం కింద ఉపా కేసు పెట్టడం సరికాదన్నారు రిటైర్డ్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు . రావణ్ చేసిన వ్యాఖ్యల్ని తాము సమర్థించడం లేదు కానీ.. ఉపా చట్టం విషయంలో మాత్రమే అభ్యంతరం ఉందన్నారు. ఈ ఉపా చట్టాన్ని ఎవరిపై పడితే వారిపై ప్రయోగించకూడదని హితవు పలికారు. ఉపా చట్టాన్ని దుర్వినియోగం చేస్తే ప్రజాహక్కులను కాలరాసే పరిస్థితి వస్తుంది అన్నారు. పోలీసులు రావణ్‌పై రిమాండ్ రిపోర్టులో ప్రస్తావించిన అంశాలను కోర్టులో నిలబడవని జోస్యం చెప్పారు. పోలీసులు రావణ్ మావోయిస్టులకు సానుభూతి పరుడని చెప్పడంతోనే రిమాండ్ విధించారన్నారు.రావణ్ రిమాండ్ రిపోర్టు మొత్తం చదివానని.. ఆయనపై నమోదు చేసిన కేసులకు యూఏపీఏ (UAPA) చట్టానికి ఎలాంటి సంబంధం లేదన్నారు. రిమాండ్ రిపోర్టులో పేర్కొన్న వీడియోలను కూడా చూశానని.. అందులో చూపించినవి చిన్న చిన్న క్లిప్‌లు మాత్రమే ఉందన్నారు. రాధామనోహర్ దాస్ అనే వ్యక్తి మరో మతంపై చేసిన వ్యాఖ్యలకు కౌంటర్‌గా రావణ్ మాట్లాడారు తప్ప, ఎవరినీ కించపరచలేదన్నారు. అలాగే ఆయనపై నాలుగు అరెస్టులకు కారణమైన వీడియోలను కూడా చూశానన్నారు. రావణ్ కొన్ని బూతులు మాట్లాడినా, అవి రాధామనోహర్ దాస్ అనే వ్యక్తిని ఉద్దేశించి మాత్రమేనన్నారు. ఆ వ్యాఖ్యలకు యూఏపీఏ చట్టం వర్తించదన్నారు.ప్రజాస్వామ్య వ్యవస్థలో పాలకుల తీరు హుందాగా ఉండాలని హితవు పలికారు వెంకటేశ్వరరావు. కక్షసాధింపుల కోసం వ్యవస్థలను వాడుకోకూడదని.. కొంతమంది అధికారులు, శక్తులు ప్రభుత్వాన్ని తప్పదోవ పట్టిస్తున్నాయని.. చట్టాలను సున్నితమైన కేసుల్లో ఇష్టానుసారంగా వాడుతున్నారని వ్యాఖ్యానించారు. రావణ్‌పై ఉపా చట్టం కింద కేసు పెట్టడం అత్యుత్సాహమని.. భావప్రకటన స్వేచ్ఛను అణచివేసేలా సాగుతున్న చర్యలపై గొంతుకను వినిపిస్తూనే ఉంటానన్నారు. రావణ్ తప్పు చేస్తే చట్టపరమైన సెక్షన్లతో కేసులు పెట్టాలే కానీ ఉపా చట్టం కింద కేసు పెట్టడం సరికాదన్నారు.ఏపీ ప్రభుత్వం ఇలాంటి చర్యల్ని నిలిపివేయాలని.. తాను ఆధునిక రాష్ట్రాన్ని కోరుకుంటున్నానన్నారు వెంకటేశ్వరరావు. పాలకులు రాష్ట్రాన్ని ఆధునిక ఆంధ్ర ప్రదేశ్‌గా తీర్చిదిద్దాలని.. ఆఫ్ఘనిస్థాన్‌లా మారే