ప్రయాణికులకు అదిరిపోయే శుభవార్త.. ఒకే టికెట్
Actor ProfilePolitician

ప్రయాణికులకు అదిరిపోయే శుభవార్త.. ఒకే టికెట్

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
ప్రయాణికులకు అదిరిపోయే శుభవార్త.. ఒకే టికెట్ పై ఆర్టీసీ, మెట్రో, ఆటో, క్యాబ్ లలో ప్రయాణం.. ముందస్తుగానే బుక్
10TV Telugu7 Jan 2027
ప్రయాణికులకు అదిరిపోయే శుభవార్త.. ఒకే టికెట్ పై ఆర్టీసీ, మెట్రో, ఆటో, క్యాబ్ లలో ప్రయాణం.. ముందస్తుగానే బుక్

TGSRTC MeSeva App : ప్రయాణికులకు వేగవంతమైన, సులువైన సేవలు అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా మీ సేవ ఆధ్వర్యంలో వినూత్నంగా మీ టికెట్ (Mee Ticket) యాప్ ను టీజీఎస్ ఆర్టీసీ అందుబాటులోకి తేనుంది. ఈ యాప్ అందుబాటులోకి వస్తే ఒకే టికెట్ పై బస్సు, మెట్రో, ఆటో, క్యాబ్ లలో ప్రయాణించే అవకాశం ఉంటుంది. ఉమ్మడి ప్లాట్‌ఫామ్‌గా ‘మీ టికెట్’ యాప్ పనిచేస్తుంది. ఈ యాప్ ద్వారా ప్రయాణికుడు ఒకేచోట ఆర్టీసీ లేదా మెట్రో టికెట్ తో పాటు తమ గమ్యస్థానానికి తగినట్లుగా ఆటో లేదంటే క్యాబ్ ను కూడా ముందస్తుగానే బుక్ చేసుకునే వీలుంటుంది. అంటే ఒకే టికెట్ పై బస్సు లేదా మెట్రో లేదంటే ఆటో, క్యాబ్ లలో ప్రయాణించేఅ వకాశం ఉంటుంది. ఈ విధానం ద్వారా ప్రయాణికులకు సులభంగా, వేగవంతంగా తమ గమ్యస్థానానికి చేరుకొనే అవకాశం ఉంటుందని టీజీఎస్ఆర్టీసీ భావిస్తోంది. ఈ యాప్ లో చెల్లింపుల ప్రక్రియను కూడా చాలా సులభతరం చేశారు. ప్రయాణికులు చెల్లించిన రుసుమును ఆయా రవాణా విభాగాలు, భాగస్వాములకు ఎప్పటికప్పుడు ఆటోమేటిక్ గా జమచేసే ఆధునిక చెల్లింపుల వ్యవస్థ ఇందులో అందుబాటులో ఉంటుంది. దీనివల్ల ప్రయాణికులకు సమయం ఆదా అవ్వడంతోపాటు రవాణా భాగస్వాములకు కూడా లావాదేవీల ప్రక్రియ వేగవంతంగా పూర్తవుతుంది. తెలంగాణలో త్వరలో‌నే ‘మీ సేవ’ యాప్‌లో మీ టికెట్ యాప్‌ను అందుబాటులోకి తీసుకురానున్నట్లు ఆర్టీసీ సంస్థ సోమవారం ఒక ప్రకటనలో పేర్కొంది. ప్రజారవాణా సేవలైన ఆర్టీసీ, మెట్రో, ఆటో, క్యాబ్.. ఇక నుంచి అన్ని ఒకే యాప్‌లో ప్రయాణికులకు అందుబాటులో ఉండాలనే ఆలోచనతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సంస్థ వెల్లడించింది. దీని ద్వారా ప్రయాణికుడు ఒకేచోట నుంచి ఆర్టీసీ, మెట్రో, ఆటో, క్యాబ్‌లో తన గమ్యస్థానానికి ముందస్తుగా బుక్ చేసుకోవచ్చని పేర్కొంది. దీని ఛార్జీలను కూడా ప్రయాణికుడు ఆన్‌లైన్‌లో చెల్లించ వచ్చని తెలిపింది. ఆర్టీసీ ఆటోలపై