
టాలీవుడ్‌లో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ రచయిత, సీనియర్ నటుడు కృష్ణేశ్వర రావు కన్నుమూశారు. గత కొంతకాలంగా శ్వాస కోశ, గుండె సమస్యలతో బాధపడుతున్న ఆయన.. ఈ రోజు(ఆగస్ట్ 11) గుంటూరులోని తన నివాసంలో


టాలీవుడ్‌లో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ రచయిత, సీనియర్ నటుడు కృష్ణేశ్వర రావు కన్నుమూశారు. గత కొంతకాలంగా శ్వాస కోశ, గుండె సమస్యలతో బాధపడుతున్న ఆయన.. ఈ రోజు(ఆగస్ట్ 11) గుంటూరులోని తన నివాసంలో

తెలుగు రంగస్థలంపై తనదైన ముద్ర వేసిన సీనియర్ నటుడు, రచయిత, దర్శకుడు యల్లాప్రగడ సౌభాగ్య కృష్ణేశ్వరరావు కన్నుమూశారు. గత కొంతకాలంగా శ్వాసకోశ, గుండె సంబంధిత అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన గుంటూరు ఏటీ అగ్రహారంలోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. ఆయన మరణంతో తెలుగు నాటకరంగంలో ఓ విశిష్ట అధ్యాయం ముగిసినట్లైంది. బుధవారం ఆయన అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. కృష్ణేశ్వరరావు కేవలం నటుడిగానే కాకుండా రచయితగా రంగస్థలానికి విశేష సేవలందించారు. ఆయన రాసిన, నటించిన ఎన్నో నాటకాలు తెలుగు రాష్ట్రాల్లోని పరిషత్ నాటక పోటీల్లో ప్రదర్శితమయ్యాయి. చిన్న వయసులోనే కళారంగంపై ఆసక్తి పెంచుకున్న కృష్ణేశ్వరరావు పాఠశాల రోజుల్లోనే నటుడిగా ప్రయాణం మొదలుపెట్టారు. ‘వాపస్’ ఆయన తొలి నాటకంగా నిలిచింది. ఆ తర్వాత రంగస్థలమే ఆయన జీవితంలో ప్రధాన భాగమైంది. ఏకంగా 1500కు పైగా నాటకాల్లో నటించడమే కాకుండా, ఎన్నో నాటకాలకు రచన కూడా చేశారు. ‘సంపద’, ‘రోజూ చస్తున్న మనిషి’, ‘పక్కింట్లో పుట్టండి’, ‘అధికారి’, ‘నష్ట పరిహారం’, ‘భూమి కోసం’, ‘గుర్తు తెలియని శవం’ వంటి నాటకాలతో ఆయనకు ప్రత్యేక గుర్తింపు వచ్చింది. తాను రచించిన నాటకాల్లోనే నటిస్తూ, వాటికి దర్శకత్వం వహించడం ఆయన ప్రత్యేకతగా నిలిచింది. పొన్నూరు కళాపరిషత్ స్థాపనలోనూ ఆయన కీలక పాత్ర పోషించారు. ప్రయోగాత్మక నాటకాలతో పలు అవార్డులు అందుకున్నారు. ‘కూతురి కోసం’ నాటకంలో నటనకు భారతముని అవార్డును కూడా అందుకున్నారు. రంగస్థలంపై ఆయన ప్రతిభను చూసిన సీనియర్ నటుడు ఎం. ప్రభాకర్‌రెడ్డి సినిమాల్లోకి పరిచయం చేశారు. కృష్ణేశ్వరరావు రాసిన ‘రోజూ చస్తున్న మనిషి’ నాటకాన్ని చూసిన ప్రభాకర్‌రెడ్డి, ‘ప్రచండ భారతం’ చిత్రానికి సంభాషణలు రాసే అవకాశం కల్పించారు. ఆ తర్వాత ఆయన సినీ రచయితగా కూడా తన ప్రతిభను చాటుకున్నారు. ‘శ్రీరాములయ్య’, ‘భద్రాచలం’ చిత్రాలకు కథ అందించారు. జయం మనదేరా మూవీ రైటింగ్ టీంలో కూడా పనిచేశారు. ‘పరశురామ్’కు సంభాషణలు రాయగా, ‘నేను సైతం’ చిత్రానికి పాటలు

మైఖేల్ జాక్సన్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన హాలీవుడ్ చిత్రం ‘మైఖేల్’ ప్రపంచవ్యాప్తంగా అపూర్వమైన విజయాన్ని అందుకుని సరికొత్త చరిత్రను సృష్టించింది. ప్రపంచ సినీ చరిత్రలోనే మొట్టమొదటి సారిగా ఒక బయోపిక్

కన్నడ చిత్ర పరిశ్రమ నుంచి పాన్ ఇండియా స్థాయికి ఎదిగిన నటుడు యష్ నటిస్తున్న తాజా చిత్రం టాక్సిక్. ఈ సినిమా నుంచి తాజాగా తబాహి అనే ప్రత్యేకమైన రొమాంటిక్ సాంగ్ విడుదలై ప్రేక్షకులను ఎంతగానో

మీ ప్రయాణం ఇది ఒక గర్వకారణమైన ఆరంభం!- విజయేంద్ర ప్రసాద్ బాహుబలి, బజరంగీ భాయిజాన్, RRR, అలాగే ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న వారణాసి వంటి అద్భుత చిత్రాలకు కథలను అందించిన ప్రముఖ రచయిత, రాజ్యసభ సభ్యులు

Kalyanam Kamaniyam Jeevitham : ఖాన్ దురాని, సాహితి ఆవంచ జంటగా వివిఫై మీడియా ఫిల్మ్ ఫ్యాక్టరీ బ్యానర్ పై పైలా ప్రసాద్ రావు, కిషోర్ గుండాల నిర్మాణంలో రవి లోకిరెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా

ఓటీటీలు వచ్చాక వినోదం మరింత సులభతరం అయిపోయింది. ఏ భాషలో రిలీజైన సరే కంటెంట్ బాగుంటే చాలు డబ్బింగ్ వర్షన్‌లోనూ తెగ చూసేస్తున్నారు. భాషతో సంబంధం లేకుండా ఓటీటీ ప్రియులు సినిమాలను ఆదరిస్తున్నారు. అందుకు

రాజమౌళి దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా తెరకెక్కుతున్న 'వారణాసి' చిత్రానికి సంబంధించి ఆసక్తికర అప్డేట్ వెలుగులోకి వచ్చింది. జక్కన్న.. టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబినేషన్‌లో వస్తున్న

Memu Kapulam: ప్రముఖ రచయిత, దర్శకుడు బి.వి.ఎస్.రవి మేకర్స్‌లో ఒకడిగా వ్యవహరించిన సరికొత్త వెబ్ సిరీస్ ‘మేము కాపులం’. భిన్నమైన టైటిల్‌తో ఇండస్ట్రీలో, ప్రేక్షకుల్లో హాట్ టాపిక్‌గా మారిన ఈ సిరీస్ గురించి తాజాగా ఆయన పాల్గొన్న ఎన్టీవీ పాడ్‌కాస్ట్ షోలో పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఆయనను ‘ఈ టైటిల్ కేవలం పబ్లిసిటీ కోసమే పెట్టారా? కాపులు, కమ్మలు అనే కులాల కోణంలో పెట్టారా?’ అని ప్రశ్నించగా.. “అవును, పబ్లిసిటీ కోసం కూడా ప్రేక్షకుల్లో ఒక రకమైన క్యూరియాసిటీ (కుతూహలం) క్రియేట్ చేయడం అవసరమే, అందుకే ఆ టైటిల్ పెట్టాం” అని ఆయన ఓపెన్‌గా ఒప్పుకున్నారు. అయితే ఈ సిరీస్ ఎలాంటి కుల వివాదాలకు తావులేకుండా, అత్యంత స్వచ్ఛంగా ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. ప్రస్తుతం ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లలో వస్తున్న వెబ్ సిరీస్‌లలో బూతులు, హింస, క్రైమ్ ఎక్కువగా ఉంటున్న తరుణంలో ‘మేము కాపులం’ వాటికి పూర్తి భిన్నంగా ఉంటుందని బి.వి.ఎస్. రవి హామీ ఇచ్చారు. ఈ సిరీస్ కుటుంబమంతా కలిసి చూడదగ్గదని చెబుతూ.. “ఈ సిరీస్‌ని మీ పిల్లలతో, తల్లిదండ్రులతో, భార్యాభర్తలతో, స్నేహితులతో కలిసి హాయిగా కూర్చొని చూడవచ్చు. మాటల్లో గానీ, విజువల్స్‌లో గానీ ఎలాంటి బూతు లేదా అశ్లీలత ఉండదు” అని స్పష్టం చేశారు. ఇందులో ఎలాంటి క్రైమ్, సస్పెన్స్ ఎలిమెంట్స్ ఉండవని.. ఇదొక అందమైన, ఆహ్లాదకరమైన ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్‌షిప్ డ్రామా అని రవి వివరించారు. ప్రేక్షకులు ఎలాంటి ఇబ్బంది లేకుండా హాయిగా ఎంజాయ్ చేస్తూ ఈ సిరీస్‌ను చూడవచ్చని చెప్పారు. ఒకసారి దర్శకుడైన తర్వాత మళ్లీ ఒక స్టెప్ వెనక్కి వేసి రైటర్‌గా కొనసాగడం కష్టమేనా అనే ప్రశ్నకు రవి ప్రాక్టికల్‌గా సమాధానమిచ్చారు. “దర్శకత్వం చేసినా