ప్రముఖ బెంగాలీ దర్శకుడు కన్నుమూత
Actor ProfileActor

ప్రముఖ బెంగాలీ దర్శకుడు కన్నుమూత

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
ప్రముఖ బెంగాలీ దర్శకుడు కన్నుమూత
Sakshi29 Dec 2026
ప్రముఖ బెంగాలీ దర్శకుడు కన్నుమూత

ప్రముఖ బెంగాలీ దర్శకుడు రాజా సేన్‌(71) కోల్‌కతాలోని ఓ ప్రైవేట్‌ ఆసుపత్రిలో ఆదివారం తుదిశ్వాస విడిచారు. అనారోగ్య సమస్యలతో గతంలో ఆసుపత్రిలో చేరారు. ఆయన మరణవార్త విని బెంగాలీ చిత్ర పరిశ్రమలో విషాదఛాయలు అలుముకున్నాయి. వెన్ను భాగంలో గాయపడటంతో తొలిత ఆయనను ఓ ప్రైవేట్‌ ఆసుపత్రిలో చేర్పించారు. చికిత్స పొందుతున్న సమయంలో ఆరోగ్యం మరింత విషమించింది. దీంతో ఆయన్ని మరో ప్రైవేట్‌ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే పరిస్థితి దిగజారడంతో చికిత్స పొందుతూ మృతి చెందారు. 1996లో సినీ ప్రయాణం: 1996లో విడుదలైన ‘దాము’ చిత్రంతో రాజా సేన్‌ దర్శకుడిగా సినీ ప్రయాణాన్ని ప్రారంభించారు. ఓ బాలుడు, ఏనుగు మధ్య ఉన్న అనుబంధం నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం ఉత్తమ బాలల చిత్రంగా జాతీయ పురస్కారాన్ని అందుకుంది. ఆ తర్వాత ‘ఆత్మీయ స్వజన్‌’, ‘దేశ్‌’, ‘దేబీపక్ష’, ‘కృష్ణకాంతేర్‌ విల్‌’, ‘లాబొరేటరీ’, ‘మాయా మృదంగ’, వంటి చిత్రాలకు ఆయన దర్శకత్వం వహించారు. 2002లో విడుదలైన ‘దేశ్‌’ చిత్రంలో జయా బచ్చన్‌, అభిషేక్‌ బచ్చన్‌ ప్రధాన పాత్రలు పోషించారు. సినిమాలతో పాటు డ్యాక్యుమెంటరీల రూపకల్పనలోనూ రాజాసేన్‌ తనదైన ముద్ర వేశారు. ప్రముఖ రవీంద్ర సంగీత గాయని సుచిత్రా మిత్రతో పాటు పలువురు ప్రముఖుల జీవితాలపై ఆయన డాక్యుమెంటరీలు రూపొందించారు. శ్రీహరి కొడుకు మేఘాంశ్‌ 'ఆస్మాన్' చిత్రం మోషన్ పోస్టర్‌ లాంచ్‌ (ఫొటోలు) హైదరాబాద్‌లో సందడి చేసిన నటుడు సోనూసూద్ (ఫొటోలు) ఆస్ట్రేలియాపై బంగ్లాదేశ్‌ సంచలన విజయం (ఫొటోలు) ‘విశ్వనాథ్ & సన్స్’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు) ఆదిలాబాద్ లో సందడి చేసిన ఐశ్వర్య రాజేష్,హెబ్బా పటేల్ (ఫొటోలు) నల్లగొండ జిల్లా రూపా రెడ్డి కేసులో బిగ్ ట్విస్ట్.. సమాధుల నుంచి కొత్త వైరస్? శాస్త్రవేత్తల తీవ్ర హెచ్చరిక! కర్నూల్ లో జగన్ సునామీని చూసి కూటమికి మైండ్ బ్లాంక్ అయినట్టుంది