ప్రభుత్వ ఉద్యోగులకు ఇంపార్టెంట్ అప్ డేట్.. బీమా ప్రయోజనాలు దక్కాలంటే వెంటనే ఈ పని చేయండి
Actor ProfilePolitician

ప్రభుత్వ ఉద్యోగులకు ఇంపార్టెంట్ అప్ డేట్.. బీమా ప్రయోజనాలు దక్కాలంటే వెంటనే ఈ పని చేయండి

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
ప్రభుత్వ ఉద్యోగులకు ఇంపార్టెంట్ అప్ డేట్.. బీమా ప్రయోజనాలు దక్కాలంటే వెంటనే ఈ పని చేయండి
Zee Telugu19 Oct 2026
ప్రభుత్వ ఉద్యోగులకు ఇంపార్టెంట్ అప్ డేట్.. బీమా ప్రయోజనాలు దక్కాలంటే వెంటనే ఈ పని చేయండి

మాధవి లగిశెట్టి (భూమి).. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్ పనిచేస్తున్నారు. ఇక్కడ బిజినెస్, స్పోర్ట్స్, క్రైమ్, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. Telangana Government Life Insurance: తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులకు సంబంధించిన తెలంగాణ ప్రభుత్వ జీవిత బీమా (టీజీఎల్‌ఐ - TGLI) పథకంలో నిబంధనల పాటింపుపై రాష్ట్ర బీమా శాఖ డైరెక్టర్ కీలక ప్రకటన విడుదల చేశారు. ఉద్యోగులు తమ నెలవారీ వేతనాల నుంచి బీమా ప్రీమియంను క్రమం తప్పకుండా చెల్లిస్తున్నప్పటికీ, దానికి సంబంధించిన ప్రతిపాదనా పత్రాలను జిల్లా బీమా కార్యాలయాల్లో సమర్పించడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆయన పేర్కొన్నారు. ఈ విధమైన అలసత్వం వల్ల ఉద్యోగులు తాము పొందాల్సిన అత్యంత కీలకమైన బీమా ప్రయోజనాలను పూర్తిగా కోల్పోయే ప్రమాదం ఉందని డైరెక్టర్ తీవ్రంగా హెచ్చరించారు. సాధారణంగా ఉద్యోగుల వేతన సవరణ జరిగినప్పుడు, పదోన్నతి వచ్చినప్పుడు లేదా వార్షిక ఇంక్రిమెంట్ల ఆధారంగా వారి బేసిక్ పే పెరుగుతుంది. నిబంధనల ప్రకారం జీతం పెరిగిన ప్రతిసారీ దానికి అనుగుణంగా టీజీఎల్‌ఐ ప్రీమియం స్లాబ్‌ కూడా మారుతుంది. ఎక్కువ మంది ఉద్యోగులు తమ జీతం నుంచి అదనపు ప్రీమియం కట్‌ అవుతున్న విషయాన్ని గమనిస్తారు కానీ, ఆ పెరిగిన ప్రీమియానికి సంబంధించిన కొత్త ప్రతిపాదనా పత్రాన్ని (ఫ్రెష్ లేదా అడిషనల్ ప్రపోజల్ ఫారమ్) పూర్తి చేసి బీమా శాఖకు అందజేయడం మరిచిపోతుంటారు. శాఖాపరంగా ప్రతిపాదనా పత్రం అందనంత వరకు పెరిగిన ప్రీమియం మొత్తానికి ఇన్సూరెన్స్ బాధ్యత వర్తించదు. ఒకవేళ ఉద్యోగికి ఏదైనా ప్రమాదం లేదా ఊహించని అరిష్టం జరిగితే, నామినీలకు క్లెయిమ్ పొందే సమయంలో తీవ్ర ఇబ్బందులు ఎదురవుతాయి. కేవలం వారు సమర్పించిన పాత ప్రపోజల్ ఫారమ్ పరిమితి మేరకే క్లెయిమ్ సెటిల్ అవుతుంది. కాబట్టి, పాలసీదారులుగా ఉన్న ఉద్యోగులు, ఉపాధ్యాయులు వెంటనే స్పందించి, తమ పెరిగిన ప్రీమియానికి