ప్రభుత్వ ఉద్యోగం కోసం దారుణం.. తల్లి హత్యకు రూ. 7 లక్షల సుపారీ ఇచ్చిన కూతురు
Actor ProfilePolitician

ప్రభుత్వ ఉద్యోగం కోసం దారుణం.. తల్లి హత్యకు రూ. 7 లక్షల సుపారీ ఇచ్చిన కూతురు

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
ప్రభుత్వ ఉద్యోగం కోసం దారుణం.. తల్లి హత్యకు రూ. 7 లక్షల సుపారీ ఇచ్చిన కూతురు
AP7AM14 Oct 2026
ప్రభుత్వ ఉద్యోగం కోసం దారుణం.. తల్లి హత్యకు రూ. 7 లక్షల సుపారీ ఇచ్చిన కూతురు

ఆస్తి, ప్రభుత్వ ఉద్యోగం కోసం కన్నతల్లినే ఓ కూతురు కిరాయి హంతకులతో కలిసి అత్యంత దారుణంగా హత్య చేయించడం రాజస్థాన్‌లోని జైపూర్‌లో సంచలనం రేపింది. ఈ హత్యను రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించేందుకు పక్కా ప్రణాళిక రచించింది. అయితే, పోలీసుల దర్యాప్తులో అసలు నిజం బయటపడింది. ఈ కేసుకు సంబంధించి పోలీసులు మృతురాలి కుమార్తె ఆయుషి శర్మ (23) సహా ఏడుగురిని అరెస్ట్ చేశారు. మరో నిందితుడు పరారీలో ఉన్నాడు.పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జైపూర్‌లోని ఓ కోర్టులో లోయర్ డివిజన్ క్లర్క్ (ఎల్‌డీసీ)గా పనిచేస్తున్న నీరజ్ శర్మ (45) జులై 3న దారుణ హత్యకు గురయ్యారు. ప్రతాప్ నగర్ ప్రాంతంలో తన కొడుకుని కోచింగ్ సెంటర్‌లో దించి స్కూటర్‌పై ఇంటికి తిరిగి వస్తుండగా, సుమారు 130 కిలోమీటర్ల వేగంతో వచ్చిన స్కార్పియో వాహనం ఆమెను బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో ఆమె దాదాపు 100 అడుగుల దూరం ఎగిరిపడి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ప్రమాదం జరిగిన వెంటనే నిందితులు వాహనంతో పరారయ్యారు.మొదట దీనిని రోడ్డు ప్రమాదంగా భావించినప్పటికీ, పోలీసులు ఘటనా స్థలంలోని సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలించగా ఇది ప్రమాదం కాదని, ఉద్దేశపూర్వకంగా చేసిన హత్య అని నిర్ధారణకు వచ్చారు. దీంతో హత్య కోణంలో దర్యాప్తు ప్రారంభించి కుట్రను ఛేదించారు. డీసీపీ రంజితా శర్మ తెలిపిన వివ‌రాల‌ ప్రకారం.. నీరజ్ శర్మ భర్త ఏడాది క్రితం మరణించారు. ఆయన మరణంతో వచ్చిన కారుణ్య నియామకం కింద నీరజ్ ఎల్‌డీసీగా ఉద్యోగంలో చేరారు.అయితే, తండ్రి మరణం తర్వాత ఆ ప్రభుత్వ