ప్రభుత్వ ఆసుపత్రి నిర్వాకంతో కుమార్తెకు హెచ్ ఐవీ
Actor ProfilePolitician

ప్రభుత్వ ఆసుపత్రి నిర్వాకంతో కుమార్తెకు హెచ్ ఐవీ

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
ప్రభుత్వ ఆసుపత్రి నిర్వాకంతో కుమార్తెకు హెచ్ ఐవీ
Eenadu6 Dec 2026
ప్రభుత్వ ఆసుపత్రి నిర్వాకంతో కుమార్తెకు హెచ్ ఐవీ

కోయంబత్తూర్, న్యూస్‌టుడే: ప్రభుత్వ ఆస్పత్రిలో రక్తం ఎక్కించిన తర్వాత కుమార్తెకు హెచ్‌ఐవీ సోకిందని ఓ తండ్రి ఆవేదన వ్యక్తం చేశారు. కోయంబత్తూర్ కాడాంపాడికి చెందిన ఓ వ్యక్తి జిల్లా కలెక్టర్ పవన్‌కుమార్కు వినతిపత్రం సమర్పించారు. తనకు కుమారుడు, కుమార్తె ఉన్నారని, 2018లో కుమార్తె అనారోగ్యానికి గురవగా వైద్య పరీక్షలో రక్తహీనత ఉందని తెలిసిందన్నారు. కోయంబత్తూర్ ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్చగా రక్తం ఎక్కించారని, కొద్దినెలల తర్వాత మళ్లీ అనారోగ్యానికి గురవగా అదే ఆసుపత్రికి తీసుకెళ్లానన్నారు. రక్తపరీక్షలు చేయగా కుమార్తెకు హెచ్‌ఐవీ ఉన్నట్లు తేలిందని పేర్కొన్నారు. తనకు, భార్యకు, కుమారుడికి హెచ్‌ఐవీ లేదని చేసిన ఆరోగ్య పరీక్షలో వెల్లడైందన్నారు. ఆస్పత్రి సిబ్బందిపై పోలీసులకు పలుసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదన్నారు. కుమార్తెకు పరిహారం అందించాలని, తమకు ఉచిత భూమి లేదా ఇల్లు కేటాయించేందుకు ముఖ్యమంత్రి చర్యలు తీసుకోవాలని కోరారు. గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు