
ప్రపంచంలోనే అతి పెద్ద గుహ అయిన సాన్ డూంగ్ కేవ్‌లోకి ఎంటర్ అయితే మనం మరో గ్రహంలో ఉన్న అనుభూతి కలుగుతుంది. వియత్నాంలోని ఫోంగ్ నా కే బ్యాంగ్ నేషనల్ పార్క్‌లో సాన్ డూంగ్ కేవ్ ప్రపంచంలోనే అతిపెద్ద నేచురల్ కేవ్‌గా ప్రసిద్ధి పొందింది. ఈ గుహ లోపల పెద్ద పెద్ద అడవులు, ప్రవహిస్తున్న నదులు, 200 మీటర్ల కన్నా ఎక్కువ ఎత్తైన రాక్ వాల్స్, పై నుంచి పడే సూర్య కిరణాలు కలిసి ఒక మ్యాజికల్ వాతావరణాన్ని క్రియేట్ చేస్తాయి. నేచర్ తన కళతో క్రియేట్ చేసిన మాస్టర్ పీస్ అని చెప్పడం అతిశయం కాదు. ఎందుకు స్పెషల్ ? సాన్ డూంగ్ గుహను 1991 లో కనుగొన్నారు. కానీ 2009 లో అంతర్జాతీయ పరిశోధకులు పూర్తిగా సర్వే చేసిన అనంతరం ఈ గుహకు ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు లభించింది. సుమారు 9 కిమీ పొడవు, 200 మీటర్ల ఎత్తు, 150 మీటర్ల వెడల్పు ఉన్న ఈ గుహలో ఒక చిన్న అడవి, మేఘాలు క్రియేట్ అయ్యే వాతావరణం, అండర్‌గ్రౌండ్ నది కూడా ఉంటాయి. అందుకే దీనిని ప్రపంచంలోనే అతిపెద్ద గుహ అని కూడా అంటారు. హైదరాబాద్ నుండి ఎలా వెళ్లాలి? హైదరాబాద్ నుండి ముందుగా వియత్నాంలోని హానోయ్ లేదా హో చి మిన్ సిటీ కి కనెక్టింగ్ విమానం తీసుకోవాలి. అక్కడి నుంచి డొమెస్టిక్ ఫ్లైట్‌లో డాంగ్ హోయ్ ఎయిర్‌పోర్టుకు చేరుకోవాలి. డాంగ్ హోయ్ నుండి సుమారు 45 కిమీ దూరంలో ఫోంగ్ నా విలేజ్‌కి ట్యాక్సీ లేదా షటిల్ బస్‌లో చేరుకోవచ్చు. సాన్ డూంగ్ కేవ్‌కి గవర్నమెంట్ అప్రూవ్డ్ గైడ్ ద్వారా మాత్రమే ఎంట్రీ ఉంటుంది. అడ్వాన్స్ బుకింగ్ తప్పనిసరి. బడ్జెట్ ఎంత అవుతుంది? అఫిషియల్ సాన్ డూంగ్ ఎక్స్‌పిడిషన్ అనేది 4 నుంచి 6 రోజులు ఉంటుంది. గైడ్, పర్మిట్స్, క్యాంపింగ్, ఫుడ్ అన్నీ కలిసి ఒక వ్యక్తికి