
మాధవి లగిశెట్టి (భూమి).. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్ పనిచేస్తున్నారు. ఇక్కడ బిజినెస్, స్పోర్ట్స్, క్రైమ్, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. Soju: ప్రపంచంలో అత్యధికంగా అమ్ముడయ్యే మద్యపానం ఏది అని మిమ్మల్ని అడిగితే..మీరు విస్కీ , వోడ్కా లేదా రమ్ అని సమాధానం ఇస్తారు . కానీ మీరు చెప్పిన సమాధానం అస్సలు కరెక్టు కాదు. ఎందుకంటే.. గత 20 సంవత్సరాలుగా.. దక్షిణ కొరియా సాంప్రదాయ మద్యమైన సోజు, ప్రపంచంలో అత్యధికంగా అమ్ముడయ్యే మద్యపానంగా నిలిచింది. ముఖ్యంగా.. జిన్‌రో సోజు బ్రాండ్ అనేక అంతర్జాతీయ బ్రాండ్‌లను అధిగమించి.. కొత్త అమ్మకాల్లో రికార్డులు నెలకొల్పుతోంది.ప్రపంచవ్యాప్తంగా కొరియన్ సంస్కృతికి పెరుగుతున్న కారణంగా.. సోజు ప్రజాదరణ ఆసియాలోనే కాకుండా ప్రపంచంలోని అనేక దేశాలలో కూడా వేగంగా పెరుగుతోంది. సోజు అంటే ఏమిటి? దానిని ఎలా తయారు చేస్తారు? సోజు అనేది కొరియా జాతీయ మద్యం. ఇది నీటిలా స్వచ్ఛంగా ఉంటుంది. సాంప్రదాయకంగా దీనిని బియ్యంతో తయారు చేసినప్పటికీ, ఇప్పుడు జిన్సెంగ్, బార్లీ.. గోధుమల నుండి స్వేదనం ద్వారా కూడా ఉత్పత్తి చేస్తున్నారు. దీనిలో ఆల్కహాల్ శాతం సాధారణంగా 12 నుండి 25 శాతం వరకు ఉంటుంది. ఇది విస్కీ, వోడ్కాల కంటే తక్కువగా ఉంటుంది. కానీ బీర్, వైన్ కంటే ఎక్కువగా ఉంటుంది. దీని రుచి తియ్యగా, మృదువుగా ఉండి, తాగడానికి సులభంగా ఉంటుంది. ప్రజాదరణకు కారణాలు ఏంటి? సోజు ప్రజాదరణకు ప్రధాన కారణం కొరియన్ వేవ్. కె-డ్రామాలు, కె-పాప్ సంగీతంలో తరచుగా కనిపించే సోజు ఆకుపచ్చ సీసా, ప్రపంచవ్యాప్తంగా యువతను ఆకర్షించి, విస్తృతమైన ఆసక్తిని రేకెత్తించింది. అంతేకాకుండా, దీనిలో ఆల్కహాల్ శాతం తక్కువగా ఉండటం వల్ల మరుసటి రోజు హ్యాంగోవర్ తక్కువగా ఉంటుంది. అందుకే యువత దీనిని ఎక్కువగా ఇష్టపడతారు. పీచ్, స్ట్రాబెర్రీ వంటి వివిధ రకాల పండ్ల
