
సర్గం రవి కుమార్. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి రాజకీయాలు, స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, జాతీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. Hyderabad: 'మేం అధికారంలోకి వచ్చిన తరవాత విద్య, వైద్యాన్ని ప్రాధాన్యంగా తీసుకున్నాం. పేదల ఆరోగ్యాన్ని బాధ్యతగా భావిస్తున్నాం. పేదలు కార్పొరేట్ ఆసుపత్రిలో ఆస్తులు అమ్ముకోవాల్సి వస్తోంది. ఆఖరికి కిడ్నీలు కూడా అమ్ముకుంటున్నారు' అని తెలంగాణ సీఎం ఆవేదన వ్యక్తం చేశారు. '32 నెలలు పరిపాలనలో రూ.2,222 కోట్లు ఆరోగ్య శాఖకు ఖర్చు పెట్టాం. రూ.5,626 కోట్లు కేవలం వైద్యం కోసమే ఖర్చు చేశాం. రూ.21,800 కోట్లు ఈ శాఖలు ఖర్చు చేశాం. జాగ్రత్తగా రూపాయి రూపాయి కూడబెట్టి వైద్యానికి ఖర్చు పెడుతున్నాం' అని రేవంత్ రెడ్డి వివరించారు. ఉస్మానియా ప్రభుత్వ ఆస్పత్రి కూలిపోవడానికి సిద్ధంగా ఉంటే పదేళ్లు అధికారంలో ఉన్నవాళ్లకి వేరే దగ్గర ఆసుపత్రి నిర్మించాలనే ఆలోచన రాలేదు అని విమర్శించారు. హైదరాబాద్ సనత్‌నగర్‌లో నిర్మించిన అత్యాధునిక సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి తెలంగాణ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (టిమ్స్)ను ప్రారంభించిన తర్వాత ముఖ్యమంత్రి కీలక ప్రసంగం చేశారు. 'ఎల్బీనగర్, అల్వాల్ టిమ్స్‌కి టెంకాయ కొట్టి నిధులు కేటాయించలేదు. ప్రతి ఆరు నెలలకోసారి ఆసుపత్రిని ప్రారంభిస్తాం. కార్పొరేట్ దీటుగా పరిశుభ్రంగా ఆసుపత్రిని నిర్వహణ చేస్తాం' అని తెలంగాణ సీఎం తెలిపారు. వైద్యులను అదనపు సమయం చేయమని చెప్పాలని.. వారికి ప్రోత్సాహకాలు ఇద్దామని అధికారులకు చెప్పారు. తమకు కష్టం ఉంటే తెలంగాణ ప్రభుత్వం ఉందని. ఆదుకోవడానికి తామున్నామనే నమ్మకం కలిగించాలని అధికార యంత్రాంగానికి ముఖ్యమంత్రి ఆదేశించారు. 'సనత్‌నగర్ ఎమ్మెల్యే (తలసాని శ్రీనివాస్ యాదవ్) కేటీఆర్‌ని తీసుకొచ్చి ఈ ఆసుపత్రిని మేమే కట్టాం అని చూపించారు. ఇక కేటీఆర్ టిమ్స్ నేనే కట్టిన అన్నారు. ఇక హైదరాబాద్ కట్టినది నేనే అన్నది