ప్రజల అవసరాలే పరమావధిగా పాలన సాగిస్తున్నాం
Actor ProfilePolitician

ప్రజల అవసరాలే పరమావధిగా పాలన సాగిస్తున్నాం

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
ప్రజల అవసరాలే పరమావధిగా పాలన సాగిస్తున్నాం
Andhra Jyothy24 Dec 2026
ప్రజల అవసరాలే పరమావధిగా పాలన సాగిస్తున్నాం

తెలంగాణ ప్రజల అవసరాలే పరమావధిగా ప్రజా ప్రభుత్వం పాలన సాగిస్తోందని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అన్నారు. కాంగ్రెస్ పాలనలో మహిళలు, విద్యార్థులు, రైతులు సహా అన్ని వర్గాలకూ సంక్షేమం అందుతోందని పేర్కొన్నారు. ఖమ్మం జిల్లా కలెక్టరేట్‌లో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో భట్టి పాల్గొన్నారు. ఖమ్మం: తెలంగాణ ప్రజల అవసరాలే పరమావధిగా ప్రజా ప్రభుత్వం పాలన సాగిస్తోందని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అన్నారు. కాంగ్రెస్ పాలనలో మహిళలు, విద్యార్థులు, రైతులు సహా అన్ని వర్గాలకూ సంక్షేమం అందుతోందని పేర్కొన్నారు. ఖమ్మం జిల్లా కలెక్టరేట్‌లో తెలంగాణ రాష్ట్ర పౌర సరఫరాల శాఖ ఆధ్వర్యంలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. డిప్యూటీ సీఎం భట్టి ముఖ్య అతిథిగా హాజరై లబ్ధిదారులకు కార్డులు అందజేశారు. ఈ సందర్భంగా గత ప్రభుత్వం కొత్త రేషన్ కార్డుల జారీ విషయంలో కాలయాపన చేసిందని విమర్శించారు. ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. మహిళా సాధికారతకు కాంగ్రెస్ ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తోందన్నారు. మహాలక్ష్మి పథకం ద్వారా ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించడంతో పాటు, స్వయం సహాయక సంఘాలకు వడ్డీ లేని రుణాలు అందిస్తున్నామని పేర్కొన్నారు. రాష్ట్రంలోని ప్రతి విద్యార్థికి అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన విద్యను అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం పని చేస్తోందని తెలిపారు. ఈ మేరకు రాష్ట్రవ్యాప్తంగా ఇంటిగ్రేటెడ్‌ స్కూళ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టిందని భట్టి చెప్పుకొచ్చారు. విద్యా రంగంలో మౌలిక సదుపాయాలను మెరుగుపరిచి విద్యార్థులకు మంచి భవిష్యత్తును అందించేందుకు చర్యలు చేపడుతున్నామని ఆయన పేర్కొన్నారు. మరోవైపు, అన్నదాతల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఉప ముఖ్యమంత్రి తెలిపారు. రైతు భరోసాతో పాటు అనేక సంక్షేమ కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేస్తున్నామని చెప్పారు. రైతులకు అండగా నిలుస్తూ వ్యవసాయ రంగాన్ని మరింత బలోపేతం చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని వివరించారు. తెలంగాణ ప్రజల ఉజ్వల భవిష్యత్తుకు బలమైన