ప్రైవేట్ బస్సును ఢీకొన్న కంటైనర్ లారీ.. ఇద్దరు మహిళల మృతి
Actor ProfilePolitician

ప్రైవేట్ బస్సును ఢీకొన్న కంటైనర్ లారీ.. ఇద్దరు మహిళల మృతి

📊 Box Office Collections
Total News3
Movie Updates0
Sources1
వరంగల్ జిల్లా శాయంపేట మెగా టెక్స్ టైల్ పార్కులో విషాదం
Andhra Jyothy15 Dec 2026
వరంగల్ జిల్లా శాయంపేట మెగా టెక్స్ టైల్ పార్కులో విషాదం

వరంగల్ జిల్లా గీసుగొండ మండలం శాయంపేట శివారులోని కాకతీయ మెగా టెక్స్‌టైల్ పార్కులో గురువారం విషాద ఘటన చోటుచేసుకుంది. గణేశా ఎకోపెట్ క్లాత్ ఫ్యాక్టరీలో లిఫ్ట్‌లో ఇరుక్కుని ఇద్దరు సిబ్బంది మృతిచెందారు

అభివృద్ధి కోసమే సీఎంకు మద్దతిచ్చా.. పోచారం మరోసారి హాట్ కామెంట్స్
Andhra Jyothy15 Dec 2026
అభివృద్ధి కోసమే సీఎంకు మద్దతిచ్చా.. పోచారం మరోసారి హాట్ కామెంట్స్

ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. అభివృద్ధి కోసమే ముఖ్యమంత్రికి మద్దతు ఇచ్చానని అన్నారు. అన్నం పెట్టిన వాళ్లను మరిచిపోతే పుట్టగతులుండవన్నారు. కామారెడ్డి, ఆగస్టు 13

ప్రైవేట్ బస్సును ఢీకొన్న కంటైనర్ లారీ.. ఇద్దరు మహిళల మృతి
Andhra Jyothy15 Dec 2026
ప్రైవేట్ బస్సును ఢీకొన్న కంటైనర్ లారీ.. ఇద్దరు మహిళల మృతి

నిజామాబాద్ జిల్లాలోని ఆర్మూర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. గోవింద్‌పేట్ ఫ్లై ఓవర్‌పై ఆగి ఉన్న ప్రైవేట్ బస్సును కంటైనర్ లారీ వెనుక నుంచి బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మహిళలు ప్రాణాలు కోల్పోయారు. నిజామాబాద్, ఆగస్టు 13: జిల్లాలోని ఆర్మూర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. గోవింద్‌పేట్ ఫ్లై ఓవర్‌పై ఆగి ఉన్న ప్రైవేట్ బస్సును కంటైనర్ లారీ వెనుక నుంచి బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మహిళలు ప్రాణాలు కోల్పోయారు. ప్రైవేటు బస్సు టైర్ పంక్చర్ అవడంతో బస్సును డ్రైవర్ రోడ్డుపై నిలిపాడు. ఈ క్రమంలో ఇద్దరు మహిళలు బస్సు ఎదుట ఉన్న డివైడర్‌పై కూర్చుకున్నారు. ఇదే సమయంలో అతివేగంతో దూసుకొచ్చిన కంటైనర్ లారీ.. వెనుక నుంచి బస్సును ఢీకొట్టింది. ఈ క్రమంలో బస్సు ముందు డివైడర్‌పై కూర్చున్న మహిళలపైకి బస్సు టైర్ ఎక్కడంతో వారు అక్కడికక్కడే మృతి చెందారు. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని మహిళల మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మృతుల వివరాలు తెలియాల్సి ఉంది. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. రేవంత్.. నువ్వు ముఖ్యమంత్రివా లేక రియల్ ఎస్టేట్ ఏజెంటువా: హరీశ్ రావు సీఎం చేతుల మీదుగా ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల భవనాలు జీఏడీకి అప్పగింత