EPS pension: ప్రైవేట్ రంగంలో పని చేసే కోట్లాది మంది ఉద్యోగుల రిటైర్మెంట్ భద్రత కోసం కేంద్ర ప్రభుత్వం ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ద్వారా ప్రావిడెంట్ ఫండ్ (PF) నిధి ఏర్పాటు చేసేందుకు అవకాశం కల్పిస్తోంది. అలాగే ఎంప్లాయీస్ పెన్షన్ స్కీమ్- 1995 ద్వారా పెన్షన్ ఇచ్చే ఏర్పాటు చేసింది. అయితే, చాలా మందికి రిటైర్ అయ్యాక తమకు నెలవారీ పెన్షన్ ఎంత వస్తుందనే విషయంపై క్లారిటీ ఉండదు. అలాగే ఎన్నేళ్లు పని చేస్తే అర్హత ఉంటుందనే విషయంపైనా అవగాహన ఉండదు. ఈపీఎస్ నిబంధనల ప్రకారం నెలవారీ పెన్షన్ పొందేందుకు కనీసం 10 ఏళ్ల సర్వీస్ పూర్తి చేసి ఉండాలి. మరి ఒక వేళ ఉద్యోగి 10 ఏళ్లు, 20 ఏళ్లు లేదా 25 ఏళ్ల పాటు ఉద్యోగం చేసినట్లయితే పెన్షన్ ఎంత వస్తుందో లెక్కలు ఓసారి పరిశీలిద్దాం. ఈపీఎస్ -95 నిబంధనల ప్రకారం నెలవారీ పెన్షన్ లెక్కించేందుకు ఒక నిర్దిష్టమైన సూత్రాన్ని అనుసరిస్తారు. ఉద్యోగి సర్వీసు కాలం, చివరి జీతం వంటి అంశాలను ఆధారంగా పెన్షన్ ఎంత ఇవ్వాలి అనేది లెక్కిస్తారు. అయితే, ప్రభుత్వ నిబంధనల ప్రకారం గరిష్ఠ పెన్షనబుల్ శాలరీ లిమిట్ నెలకు రూ.15000గా ఉంది. భవిష్యత్తులో ఇది పెరిగితే పెన్షన్ సైతం పెరుగుంది. నెలవారీ పెన్షన్ = (సగటు పెన్షనేబుల్ శాలరీ X సర్వీసు కాలం సంవత్సరాల్లో)/70సర్వీస్ కాలం బట్టి పెన్షన్ లెక్కలు ఇలా సర్వీస్ కాలం(సంవత్సరాల్లో) వెయిటేజ్ బోనస్ లెక్కించే సర్వీస్ నెలవారీ పెన్షన్ 10 వర్తించదు 10 సంవత్సరాలు రూ.2,143 20 2 ఏళ్లు 22 సంవత్సరాలు రూ.4,714 26 2 ఏళ్లు 27 సంవత్సరాలు రూ.5,786 2 ఏళ్ల బోనస్ నియమం ఎవరైనా ఉద్యోగి 20 సంవత్సరాలు లేదా అంత కంటే ఎక్కువ కాలం సర్వీస్ పూర్తి చేసుకున్నట్లయితే వారికి ఈపీఎఫ్ఓ అదనంగా 2 సంవత్సరాల వెయిటేజ్ బోనస్ ఇస్తుంది. అందుకే 20 ఏళ్ల
Actor ProfilePolitician
ప్రైవేట్ కంపెనీలో.. 10 ఏళ్లు ఉద్యోగం చేస్తే పెన్షన్ ఎంతొస్తుంది? 20
📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
Samayam Telugu•4 Oct 2026
ప్రైవేట్ కంపెనీలో.. 10 ఏళ్లు ఉద్యోగం చేస్తే పెన్షన్ ఎంతొస్తుంది? 20, 25 ఏళ్లకు ఎంత? లెక్కలు ఇవే