పార్లమెంట్ బయట పోటాపోటీ నిరసనలు.. అమిత్ షా వివరణకు ప్రతిపక్షం పట్టు
Actor ProfilePolitician

పార్లమెంట్ బయట పోటాపోటీ నిరసనలు.. అమిత్ షా వివరణకు ప్రతిపక్షం పట్టు

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
పార్లమెంట్ బయట పోటాపోటీ నిరసనలు.. అమిత్ షా వివరణకు ప్రతిపక్షం పట్టు
AP7AM2 Dec 2026
పార్లమెంట్ బయట పోటాపోటీ నిరసనలు.. అమిత్ షా వివరణకు ప్రతిపక్షం పట్టు

పార్లమెంట్‌ మకర ద్వారం వద్ద అధికార, ప్రతిపక్ష ఎంపీలు పోటాపోటీగా నిరసనలు చేపట్టారు. ఝార్ఖండ్‌లో విద్యార్థుల ఆందోళనపై విపక్షం ద్వంద్వ వైఖరి ప్రదర్శిస్తోందని ఎన్‌డీయే ఆరోపించింది. పార్లమెంట్‌ కార్యకలాపాలను అడ్డుకుంటోందని విమర్శించింది. మరోవైపు ఢిల్లీలో గత నెల విద్యార్థులపై పోలీసు చర్యపై కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా సభలో సమాధానం చెప్పాలని ప్రతిపక్షం డిమాండ్‌ చేసింది.ఎన్‌డీయే ఎంపీలు రాహుల్‌ గాంధీని లక్ష్యంగా చేసుకుని నినాదాలు చేశారు. అమిత్‌ షా సమాధానంపై చర్చకు రావాలని, పారిపోవద్దంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. ఝార్ఖండ్‌లో శాంతియుతంగా ఆందోళన చేస్తున్న విద్యార్థులపై పోలీసులు లాఠీచార్జి చేసినా రాహుల్‌ గాంధీ మౌనం వహిస్తున్నారని ఆరోపించారు. ఝార్ఖండ్‌ ప్రభుత్వంలో కాంగ్రెస్‌ భాగస్వామిగా ఉన్న విషయాన్ని ప్రస్తావించారు.మరోవైపు కాంగ్రెస్‌ ఎంపీలు అమిత్‌ షా సభకు రావాలంటూ నినాదాలు చేశారు. జులై 20న ఢిల్లీలో విద్యార్థుల నిరసనపై జరిగిన పోలీసు చర్యకు బాధ్యత ఎవరిదో హోంమంత్రి స్వయంగా వివరించాలని డిమాండ్‌ చేశారు. ఈ అంశంపై చర్చకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెబుతున్నా.. అమిత్‌ షా సభకు వచ్చి సమాధానం చెప్పాల్సిందేనని పట్టుబట్టారు.ఝార్ఖండ్‌లో పరీక్షల్లో అవకతవకలను నిరసిస్తూ విద్యార్థులు రాంచీలో అసెంబ్లీ ముట్టడికి ప్రయత్నించారు. వారిని అడ్డుకునేందుకు పోలీసులు లాఠీలు, వాటర్‌ క్యానన్లు ప్రయోగించారు. దీనిపై రాహుల్‌ గాంధీ ఇప్పటికే స్పందించారు. విద్యార్థులపై బలప్రయోగం సరికాదని, శాంతియుత నిరసనకు వారికి హక్కు ఉందని అన్నారు. చర్చల ద్వారా సమస్య పరిష్కరించాలని ఝార్ఖండ్‌ ప్రభుత్వాన్ని కోరారు.అయితే రాహుల్‌ గాంధీ విద్యార్థుల అంశాల్లో ఆచితూచి స్పందిస్తున్నారని బీజేపీ ఎంపీ దినేశ్‌ శర్మ ఆరోపించారు. ఝార్ఖండ్‌లో