పార్లమెంట్ ఫైనల్ షో.. చర్చా? చిచ్చా
Actor ProfilePolitician

పార్లమెంట్ ఫైనల్ షో.. చర్చా? చిచ్చా

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
పార్లమెంట్ ఫైనల్ షో.. చర్చా? చిచ్చా
Sakshi13 Dec 2026
పార్లమెంట్ ఫైనల్ షో.. చర్చా? చిచ్చా

పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాలు ముగింపు దశకు చేరుకున్నా.. అధికార, విపక్షాల మధ్య నెలకొన్న రాజకీయ ప్రతిష్టంభనకు మాత్రం తెరపడలేదు. సభ సజావుగా సాగేందుకు సహకరించాలని ప్రధాని నరేంద్ర మోదీ చేసిన విజ్ఞప్తి నుంచి.. నిన్నటి వరకు ఉభయ సభల్లో వాయిదాల పర్వమే కొనసాగింది. 18 రోజుల పాటు విద్యార్థుల ఆందోళనలు, పోలీసుల చర్యలపై చర్చకు పట్టుబట్టిన విపక్షాలు.. మరోవైపు సభలను నడిపేందుకు కేంద్రం చేసిన ప్రయత్నాలు.. వెరసి పార్లమెంట్‌ వేదికగా రాజకీయ వేడి కొనసాగింది. లోక్‌సభ, రాజ్యసభల కార్యకలాపాల సమయం కంటే వాయిదాలు, నిరసనలకే ఎక్కువ సమయం పోయింది. చివరి దశలో పార్లమెంట్‌ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్‌ రిజిజు విపక్ష నేత రాహుల్‌ గాంధీతో భేటీ కావడం ఆసక్తి రేపినా.. ప్రతిష్టంభనకు మాత్రం తెరపడలేదు. నిరసనల మధ్యే పలు కీలక బిల్లులు మూజువాణి ఓటుతో ఆమోదం పొందగా.. సభ వెలుపల కూడా అధికార, విపక్ష ఎంపీల పోటాపోటీ నినాదాలతో రాజకీయ వాతావరణం వేడెక్కింది. ఇక వర్షాకాల సమావేశాల ఇవాళ చివరి రోజు కూడా అదే ఉత్కంఠ కొనసాగుతోంది. చర్చకు ప్రభుత్వం సిద్ధమంటోంది.. బాధ్యతపై నేరుగా సమాధానం కావాలంటూ విపక్షాలు పట్టుబడుతున్నాయి. దీంతో పార్లమెంట్‌ ఫైనల్‌ షోలో చర్చకు తెరలేస్తుందా?.. లేక మరోసారి చిచ్చు రగులుతుందా? అన్నది ఆసక్తికరంగా మారింది. చర్చకు సిద్ధం: అమిత్‌ షా విద్యార్థుల నిరసనలు, పోలీసుల చర్యలపై ఏ అంశాన్నైనా చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా తెలిపారు. తానేం పారిపోలేదని.. రోజూ పార్లమెంట్‌కు వచ్చి తన ఛాంబర్‌లోనే కూర్చుకుంటున్నానని.. ఉద్దేశపూర్వకంగా విపక్షాలు సభల్ని అడ్డుకుంటున్నాయని మండిపడ్డారు. బుధవారం మధ్యాహ్నం 3 గంటల నుంచి గురువారం మధ్యాహ్నం 3 గంటల వరకు సుదీర్ఘ చర్చ కొనసాగించేందుకు సిద్ధమని స్పీకర్‌కు తెలియజేశారు. ప్రజాస్వామ్యంలో సమస్యలకు పరిష్కారం చర్చల ద్వారానే సాధ్యమని.. ప్రభుత్వానికి దాచాల్సింది ఏమీ లేదని అమిత్‌ షా స్పష్టం చేశారు. విపక్షాలు లేవనెత్తే ప్రతి ప్రశ్నకు