పార్లమెంట్ ను కుదిపేసిన బీజేపీ ఎంపీ లుంగీవాలా వ్యాఖ్యలు’.. దక్షిణాది సభ్యుడి
Actor ProfilePolitician

పార్లమెంట్ ను కుదిపేసిన బీజేపీ ఎంపీ లుంగీవాలా వ్యాఖ్యలు’.. దక్షిణాది సభ్యుడి

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
పార్లమెంట్ ను కుదిపేసిన బీజేపీ ఎంపీ లుంగీవాలా వ్యాఖ్యలు’.. దక్షిణాది సభ్యుడిపై అనుచిత భాష
Samayam Telugu10 Dec 2026
పార్లమెంట్ ను కుదిపేసిన బీజేపీ ఎంపీ లుంగీవాలా వ్యాఖ్యలు’.. దక్షిణాది సభ్యుడిపై అనుచిత భాష

పార్లమెంట్‌లో ‘లుంగీవాలా వ్యాఖ్యలు’ తీవ్ర కలకలం రేపుతున్నాయి. సీపీఐ (ఎం) ఎంపీ జాన్ బ్రిట్టాస్ తనను బీజేపీ ఎంపీ సుష్మితా దేవ్ ‘లుంగీవాలా’ అంటూ అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారని ఆరోపించారు. ఆమె వ్యాఖ్యలను ఖండిస్తూ రాజ్యసభలో తీర్మానాన్ని కూడా ప్రవేశపెట్టిన జాన్ బ్రిట్టాస్.. దక్షిణాది వ్యక్తిగా తన ఆహార్యం తనకు ఎంతో గర్వకారణమని స్పష్టం చేశారు. ప్రజాస్వామ్య దేవాలయమైన పార్లమెంటు వేదికగా ఓ ప్రాంతాన్ని అవమానించేలా వ్యాఖ్యలు చేయడం దురదృష్టకరమమని అన్నారు.తాను ఓ రోజు సభలో మాట్లాడుతుంటే లుంగీవాలా అంటూ నన్ను ఉద్దేశించి అమర్యాదకర వ్యాఖ్యలు చేశారని రాజ్యసభ ఎంపీ పేర్కొన్నారు. ‘‘నేను ధోతీలో ఉన్నా. మలయాళీని, దక్షిణాది వ్యక్తిని అయినందుకు గర్వపడుతున్నాను.. కానీ, తమ సంస్కృతి పట్ల అవమానకరమైన వ్యాఖ్యలు చేయడం ఎంత మాత్రం ఆమోదయోగ్యం కాదు. ఈ విషయంపై సభ దృష్టి సారించాలి. ఆమెకు వ్యతిరేకంగా ప్రివిలెజ్ మోషన్‌ను ప్రవేశపెట్టాను.. ఆమెపై నాకు ఎటువంటి ద్వేషం లేదు’ అని ఎంపీ బ్రిట్టాస్ తెలిపారు. అయితే, తన బాధ్యతలు నిర్వర్తించనీయకుండా బీజేపీ ఎంపీ పదే పదే అడ్డుపడ్డారని ఆయన ఆరోపించారు. పలుసార్లు ‘లుంగీవాలా’ అని కించపరిచేలా వ్యాఖ్యలు చేశారని తెలిపారు.దీనిపై కేంద్ర మంత్రి, బీజేపీ సభాపక్ష నేత జేపీ నడ్డా స్పందిస్తూ.. లుంగీ కామెంట్స్‌ను తాము సమర్థించమని స్పష్టం చేశారు. బ్రిట్టాస్ అభ్యంతరాలు, తమ పార్టీ ఎంపీ వ్యాఖ్యలు అన్నీ రికార్డుల్లోకి చేరాయని ఆయన అన్నారు. సుస్మితా దేవ్‌కు మాట్లాడేందుకు అవకాశం ఇవ్వాలని ఆయన స్పష్టం చేశారు. అంతేకాదు, అది తమ దృష్టిలో ధోతీ అని తెలిపారు. పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు మాట్లాడుతూ.. సభ హుందాతనాన్ని కాపాడాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. ‘సభకు సభ్యులందరూ సమానమే.. ఒక సభ్యుడిపై ఆరోపణలు వచ్చాయి.. కాబట్టి వారికీ తమ వివరణ ఇచ్చేందుకూ అవకాశం ఇస్తున్నాం.. సభా గౌరవానికి భంగం కలిగించేది ఏదైనా జరిగితే ఛైర్మన్ వారిని తన ఛాంబర్‌కు పిలిపించి వాదనలు