ప్రేమయాత్ర.. చివరి రోజు ఊహించని మలుపు
Actor ProfilePolitician

ప్రేమయాత్ర.. చివరి రోజు ఊహించని మలుపు

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
ప్రేమయాత్ర.. చివరి రోజు ఊహించని మలుపు
Sakshi19 Nov 2026
ప్రేమయాత్ర.. చివరి రోజు ఊహించని మలుపు

ఇంటర్‌ ఫస్టియర్‌ చదివే అతనికి ఇంకొన్ని వారాల్లో పదిహేడు వస్తుంది. ఆ వయసులో శరీరంలోని హార్మోన్స్‌ ఉత్పత్తి వల్ల మానసిక, శారీరక అవసరమైన కోరిక పుడుతుంది. ఆ సమయంలో టీనేజర్‌ ప్రేమలో పడతాడు. అతని ప్రేమయాత్ర మొదలవుతుంది. అతను తన క్లాస్‌మేట్‌ వాల్గంటితో ప్రేమలో పడ్డాడు. క్లాస్‌లోని ఇరవై ఏడుమంది అమ్మాయిల్లో వాల్గంటే అతన్ని ఎందుకు ఆకర్షించింది? ఇది సమాధానం లేని ప్రశ్న. ఎవరు ఎవరితో ఎందుకు ప్రేమలో పడతారనే దానికి ఇదమిత్థమైన కారణం పడ్డవాడితో సహా ఎవరూ చెప్పలేరు. దానికి ‘కెమిస్ట్రీ’ అనే ఆధునిక జవాబు స్థిరపడింది. ఆమె తనని ప్రేమిస్తోందా అనే ప్రశ్న అతన్ని తొలచసాగింది. వాల్గంటి అతని మీద ఎలాంటి ప్రత్యేక ఆసక్తిని చూపించలేదు. ప్రేమయాత్రలో ఒకరు తమ ప్రేమని తెలియచేస్తే, రెండోవారు దాన్ని అంగీకరించాలి. అప్పుడు అది కొనసాగుతుంది. తిరస్కరిస్తే ఆ ప్రేమయాత్ర అంతటితో ముగుస్తుంది. అతనికి తన ప్రేమని ఆమెకి తెలియచేయాలని ఉంది. కాని ఆ ధైర్యం చేయలేకపోయాడు. టీచర్‌కి చెప్తే? తిరస్కరిస్తే? తనని చెడ్డవాడిగా భావిస్తే లాంటి భయాలు అతనిలో కలిగాయి. క్లాస్‌లోకి రాగానే ఆమె వచ్చిందా అని చూస్తాడు. కనపడకపోతే ‘అసలు ఇవాళ వస్తుందా?’ అనే అనుమానం అతన్ని బాధిస్తుంది. ఆమె వస్తే ఆనందం కలుగుతుంది. ఆమె ఎదురు పడినప్పుడు రెండు మూడు సార్లు చిరునవ్వులు నవ్వాడు. ఆమె అతనివైపు చూడకపోవడంతో అది గమనించలేదు. ఆమెకి తన ప్రేమ గురించి ఎలా తెలియచేయాలో అతనికి తోచలేదు. మధ్యవర్తి ఆలోచన వచ్చింది. కాని మిత్రుడి దగ్గర మాటలు నోట్లోంచి బయటికి రాలేదు. ఓరోజు వాల్గంటి లంచ్‌లో కాలేజీ బయట బండి దగ్గర పానీపూరీ తింటూ కనిపించింది. అతను కూడా వాటిని తిన్నాడు. మొదటిసారి ఆమెతో మాట్లాడాడు. ‘‘నీ డబ్బు కూడా నేను పే చేస్తాను.’’ అతను చెప్పాడు. ‘‘ఒద్దు.’’ ఆమె జవాబు చెప్పింది. తన డబ్బు చెల్లించి ఆమె వెళ్ళిపోయింది. చివరికి అతను ఆమెకి ఉత్తరం