
Eenadu•20 Jan 2027
పార్టీకి వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా చర్యలు తప్పవుకాంగ్రెస్ పార్టీపై కొండా సుస్మిత వ్యాఖ్యలను ఖండిస్తున్నామని పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్ అన్నారు. గురువారం నిజామాబాద్‌లో పర్యటించిన ఆయన మీడియాతో మాట్లాడారు. పార్టీకి వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా క్రమశిక్షణ చర్యలు తప్పవని హెచ్చరించారు. సుస్మిత వ్యాఖ్యలపై మంత్రి కొండా సురేఖకు ఇప్పటికే షోకాజ్ నోటీసులు ఇచ్చినట్లు తెలిపారు. ఆమె వివరణ ఆధారంగా తదుపరి చర్యలుంటాయని వెల్లడించారు. ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి వ్యాఖ్యలపై ఆయనతో మాట్లాడినట్టు మహేశ్‌కుమార్ గౌడ్ తెలిపారు. ఆయన ఆవేదనను అర్థం చేసుకున్నామన్నారు. ఈ వార్త చదివారా: మంత్రి కొండా సురేఖకు షోకాజ్