పూరి జగన్నాథుడికి సంబంధించిన కొత్త విగ్రహాలను ప్రతిష్టించేందుకు ముందుగా నలుగురు పెద్దలు ఆలయం లోపలికి వెళ్తారు. పూర్వకాలం నుంచి ఇప్పటివరకు ఓ వంశానికి చెందిన వారే ఈ బ్రహ్మ పదార్థాన్ని మారుస్తున్నారు. వారి కుటుంబంలో ఎవరైతే పెద్ద మనిషిగా ఉంటారో వారు మాత్రమే ఈ క్రతువులో పాల్గొంటారు. ముందుగా ఆయన నడుముకు తాడు కట్టి చివర్లో ఓ గంట కడతారు. తన కళ్లకు గంతలు కట్టి గుడి లోపల ఉండే విగ్రహాల దగ్గరకు తీసుకెళ్లి వదిలేస్తారు. అనంతరం అందరూ బయటకు వచ్చేసి పూరి నగరమంతా కరెంట్ కట్ చేస్తారు. పూరి నగరం మొత్తం చీకటి మయంగా మారినప్పుడు పాత విగ్రహాల పక్కనే కొత్త విగ్రహాలు ఏర్పాటు చేసి ఉంటారు. జగన్నాథుడి విగ్రహానికి గుండె ప్రాంతంలో ఓ చిన్న గది ఉంటుంది. విగ్రహాలకు దుస్తులు చుట్టేసి ఉంటాయి. ఆ పెద్దాయన దుస్తులను తొలగించి జగన్నాథుడి గుండె దగ్గర ఉన్న చిన్న గది లోపల ఉన్న బ్రహ్మపదార్థాన్ని కొత్త విగ్రహంలోకి ప్రవేశపెడతారు. ఈ మొత్తం తతంగం అంత పూర్తయిన తర్వాత ఆ పెద్ద మనిషి గంటను మోగిస్తారు. అప్పుడు పాత విగ్రహాల స్థానంలో కొత్తవాటిని ప్రతిష్టిస్తారు. అనంతరం పాత విగ్రహాలను తీసుకెళ్లి సమాధి చేస్తారు. దీన్ని నవకళేబర యాత్ర అంటారు. పూరీ జగన్నాథుడి విగ్రహం లోపల ఉండే బ్రహ్మపదార్థంలో కన్నయ్య గుండె ఉందనే ప్రచారం ఎప్పటినుంచో జరుగుతోంది. దీనికి సంబంధించి ఓ పురాణ కథ కూడా ఉంది. పూర్వ కాలంలో జర అనే ఓ వేటగాడు కృష్ణుడిని పొరపాటున బాణంతో కొట్టి తర్వాత అంత్యక్రియలు నిర్వహించాడు. అయితే తన శరీరమంతా కాలి బూడిదైనప్పటికీ తన గుండెకి ఏం కాలేదు. అందుకే దాన్ని ఓ సంచిలో పెట్టుకుని చెక్కపెట్టేలో ఉంచి సాగరంలో వదిలేశాడు. అది పూరి తీరానికి కొట్టుకొస్తే అప్పటి రాజు దాన్ని గ్రహించి, అది ఎంతో విశిష్టమైనదిగా భావించి, జగన్నాథుడి విగ్రహంలో పెట్టించారని స్థానికులు చెబుతారు. భాగవతం
Actor ProfilePolitician
పూరి జగన్నాథుడి విగ్రహంలోని బ్రహ్మపదార్థం రహస్యమేంటి? శ్రీకృష్ణుడి గుండె అనే నమ్మకంలో నిజమెంత
📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
Samayam Telugu•27 Oct 2026
పూరి జగన్నాథుడి విగ్రహంలోని బ్రహ్మపదార్థం రహస్యమేంటి? శ్రీకృష్ణుడి గుండె అనే నమ్మకంలో నిజమెంత