గర్భధారణ అనేది ప్రతి మహిళ జీవితంలోనూ ఎంతో సంతోషకరమైన సమయం. అయితే, అదే సమయంలో అంతే బాధ్యతగా, అప్రమత్తంగా ఉండటం కూడా చాలా ముఖ్యం. ఎందుకంటే కొన్ని రకాల ఆరోగ్య సమస్యలు ముందస్తు హెచ్చరికలు లేకుండా అకస్మాత్తుగా రావచ్చు. గర్భధారణ సమయంలో వచ్చే అత్యవసర పరిస్థితుల గురించి ప్రాథమిక అవగాహన ఉంటే, తల్లిని, పుట్టబోయే బిడ్డను సురక్షితంగా కాపాడుకోవడానికి వీలవుతుంది. ప్రెగ్నెన్సీ సమయంలో అత్యవసర పరిస్థితి అంటే ఏంటి? ఎలాంటి లక్షణాలు కనిపిస్తే అలర్ట్ అవ్వాలి? అన్న పూర్తి వివరాల్ని డాక్టర్. మయూరి పరాఖ్ (కన్సల్టెంట్ - ప్రసూతి & గైనకాలజీ, స్పర్శ్ హాస్పిటల్, సర్జాపూర్ రోడ్, బెంగళూరు) ద్వారా తెలుసుకుందాం.గర్భధారణ అత్యవసర పరిస్థితి అంటే ఏంటి? గర్భధారణ సమయంలో, కాన్పు సమయంలో లేదా కాన్పు జరిగిన కొద్ది రోజుల లోపు తల్లి లేదా పుట్టబోయే బిడ్డ ప్రాణాలకు, ఆరోగ్యానికి ముప్పు కలిగించే ఎలాంటి ఊహించని ఆరోగ్య సమస్యనైనా "గర్భధారణ అత్యవసర పరిస్థితి" అంటారు. ఇవి గర్భం దాల్చిన మొదటి వారం నుంచి డెలివరీ అయ్యే వరకు ఏ దశలోనైనా రావచ్చు.సాధారణంగా వచ్చే అత్యవసర సమస్యలు తీవ్రమైన రక్తస్రావం (Bleeding) అధిక రక్తపోటు (Pre-eclampsia) తీవ్రమైన ఇన్ఫెక్షన్లు ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ (గర్భాశయం వెలుపల పిండం పెరగడం) నెలలు నిండకుండానే ప్రసవ నొప్పులు రావడం (Preterm Labour) మాయ సమస్యలు.గర్భం దాల్చిన మొదటి నెలల్లో ప్రమాద సంకేతాలు ప్రెగ్నెన్సీలో మొదటి త్రైమాసికం (మొదటి మూడు నెలలు) చాలా కీలకమైనది. ఈ సమయంలో కింది లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చేయకూడదు. కడుపు కింది భాగంలో తీవ్రమైన నొప్పి లేదా రక్తస్రావం: ఇది గర్భస్రావం (Miscarriage) లేదా ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీకి సంకేతం కావచ్చు. కళ్ళు తిరగడం, స్పృహతప్పడం లేదా గుండె వేగంగా కొట్టుకోవడం: లోపల అంతర్గత రక్తస్రావం జరుగుతోందని చెప్పడానికి ఇది ఒక గుర్తు. భుజం చివర భాగంలో నొప్పి: పొత్తికడుపు నొప్పితో పాటు భుజం నొప్పి
Actor ProfilePolitician
ప్రెగ్నెన్సీలో ఎప్పుడు అప్రమత్తమవ్వాలి? నిర్లక్ష్యం చేయకూడని లక్షణాల్ని క్లియర్ గా వివరించిన డాక్టర్
📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
Samayam Telugu•20 Oct 2026
ప్రెగ్నెన్సీలో ఎప్పుడు అప్రమత్తమవ్వాలి? నిర్లక్ష్యం చేయకూడని లక్షణాల్ని క్లియర్ గా వివరించిన డాక్టర్