
హాలహర్వి: ప్రస్తుతం నీటి పొదుపు పాటించాలని రాష్ట్ర ప్రభుత్వం, అధికారులు అవగాహన, ప్రచారం చేస్తున్నారు. అయితే పైపు లైన్ లీకేజీతో తాగునీరు వృథాగా ప్రవహిస్తోంది. కర్నూలు జిల్లా హాలహర్వి మండల కేంద్రంలో మీసేవా సమీపంలో కొన్ని రోజులుగా పైపులైన్ లీకేజీ కారణంగా జాతీయ రహదారిపై తాగునీరు వృథాగా ప్రవహిస్తోంది. భవిష్యత్తులో తాగునీటి కోసం తీవ్ర ఇబ్బందులు ఏర్పడే అవకాశం ఉందని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి మరమ్మతులు చేయాలని స్థానికులు కోరుతున్నారు. గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు