పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహం అర్ధరాత్రి తొలగింపు.. బీఆర్ఎస్ నేతల అడ్డగింత
Actor ProfilePolitician

పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహం అర్ధరాత్రి తొలగింపు.. బీఆర్ఎస్ నేతల అడ్డగింత

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహం అర్ధరాత్రి తొలగింపు.. బీఆర్ఎస్ నేతల అడ్డగింత, నర్సంపేటలో తీవ్ర ఉద్రిక్తత
Samayam Telugu9 Jan 2027
పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహం అర్ధరాత్రి తొలగింపు.. బీఆర్ఎస్ నేతల అడ్డగింత, నర్సంపేటలో తీవ్ర ఉద్రిక్తత

వరంగల్ జిల్లా నర్సంపేటలో అర్ధరాత్రి హైడ్రామా చోటుచేసుకుంది. దివంగత మాజీ ఎమ్మెల్యే, తెలంగాణ ఉద్యమకారుడు పెద్ది సుదర్శన్‌రెడ్డి విగ్రహాన్ని అధికారులు తొలగించడంతో పట్టణంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. నర్సంపేట మెడికల్ కాలేజీ సమీపంలో ఇటీవల ఏర్పాటు చేసిన పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహాన్ని మంగళవారం తెల్లవారుజామున సుమారు 3.30 గంటల సమయంలో భారీ పోలీసు బందోబస్తు మధ్య మున్సిపల్, రెవెన్యూ అధికారులు తొలగించినట్లు తెలుస్తోంది. విగ్రహాన్ని తొలగించడంతో పాటు గద్దెను కూడా నేలమట్టం చేశారు.విగ్రహం తొలగింపు నేపథ్యంలో నర్సంపేటలో భారీగా పోలీసు బలగాలను మోహరించారు. సుమారు 1500 మంది పోలీసులు నర్సంపేట పట్టణంలో బందోబస్తు నిర్వహించినట్లు స్థానికుల ద్వారా తెలుస్తోంది. ఇక విగ్రహం తొలగింపులో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పరిసర ప్రాంతాల్లో ఆంక్షలు విధించారని బీఆర్ఎస్ వర్గాలు ఆరోపించాయి. అక్కడికి ఎవరినీ అనుమతించకుండా పోలీసులు చర్యలు చేపట్టారని.. సంఘటన స్థలాన్ని పరిశీలించేందుకు మీడియాను కూడా పోలీసులు అనుమతించలేదని తెలుస్తోంది.నర్సంపేట మెడికల్ కాలేజీ ఎదురుగా ప్రభుత్వ అసైన్డ్ భూమిలో విగ్రహాన్ని ఏర్పాటు చేసేందుకు సంబంధిత అనుమతులు లేకుండా పెద్ది సుదర్శన్‌రెడ్డి విగ్రహాన్ని ఏర్పాటు చేశారని అధికారులు ఆరోపణలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే మున్సిపల్, రెవెన్యూ అధికారులు పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహాన్ని తొలగించినట్లు సమాచారం. అయితే ఈ అంశంపై అధికారుల నుంచి పూర్తి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.విగ్రహం తొలగింపు విషయం తెలుసుకున్న బీఆర్ఎస్ నేతలు.. ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి నర్సంపేటకు వెళ్లేందుకు ప్రయత్నించడంతో ఉద్రిక్తత మరింత పెరిగింది. హనుమకొండలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం నుంచి ఎమ్మెల్సీ మధుసూదనాచారి నేతృత్వంలో నేతలు నర్సంపేటకు బయలుదేరగా పోలీసులు వారిని అడ్డుకున్నారు. ఈ క్రమంలో పోలీసులు, బీఆర్ఎస్ కార్యకర్తల మధ్య తోపులాట చోటుచేసుకుంది. అనంతరం ఎమ్మెల్సీ మధుసూదనాచారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది.నర్సంపేటలో పరిస్థితులు మరింత ఉద్రిక్తంగా మారకుండా ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా పలువురు బీఆర్ఎస్ ముఖ్య నేతలను పోలీసులు ముందస్తుగా అదుపులోకి