పృథ్వీరాజ్ సుకుమారన్ ... ఐ
Actor ProfilePolitician

పృథ్వీరాజ్ సుకుమారన్ ... ఐ

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
పృథ్వీరాజ్ సుకుమారన్ ... ఐ, నోబడీ మూవీ రివ్యూ
Chitrajyothy18 Oct 2026
పృథ్వీరాజ్ సుకుమారన్ ... ఐ, నోబడీ మూవీ రివ్యూ

పృథ్వీరాజ్‌ సుకుమారన్ 'ఐ, నోబడీ' సినిమా ఎలా ఉందంటే... నటుడిగానే కాకుండా దర్శకుడిగానూ తన సత్తాను చాటుకుంటున్నాడు మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్‌ సుకుమారన్‌. 'లూసిఫర్, ఎల్2: ఎంపురాన్' వంటి సినిమాలతో తెలుగు వారికి దగ్గరయ్యాడు. 'ది గోట్‌ లైఫ్‌'మూవీ కోసం అద్భుతమైన మేకోవర్ చేసిన పృథ్వీరాజ్‌ సినిమా అంటే సమ్ థింగ్‌ స్పెషల్ అనే భావన తెలుగు వారికి కలిగింది. ఇప్పుడు రాజమౌళి మాగ్నమ్ ఓపస్ మూవీ 'వారణాసి'లో నటిస్తుండటంతో అతనిపై తెలుగు సినిమా ప్రేక్షకుల ఫోకస్ మరింత పెరిగింది. మరి తెలుగులో డబ్ అయిన పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ (Prithviraj Sukumaran) తాజా మలయాళ చిత్రం ఐ, నోబడీ (I, Nobody) ఎలా ఉందో తెలుసుకుందాం. రాజీవ్‌ (పృథ్వీరాజ్‌ సుకుమారన్), మీరా (పార్వతి తిరువోతు) మిడిల్‌ క్లాస్‌ ఫ్యామిలీకి చెందిన భార్యాభర్తలు. వారికి ఇద్దరు అమ్మాయిలు. మీరా ప్రైవేట్‌ జాబ్ చేస్తుంటే, రాజీవ్‌ ప్రభుత్వ ఉద్యోగం చేస్తుంటాడు. ఓ రోజు అతనో బ్యాంక్‌కు వెళ్ళినప్పుడు అక్కడకు ముగ్గురు వ్యక్తులు వచ్చి, 17 కోట్ల రూపాయలను దోచుకుని వెళ్తారు. అక్కడ నుంచి తప్పించుకునే సమయంలో రాజీవ్‌ ముఖానికి ముసుగువేసి అతన్నీ తమతో తీసుకెళతారు. మార్గం మధ్యలో రాజీవ్‌ ను దించేసి, తమ దారిన తాము వెళ్ళే క్రమంలో రాజీవ్‌ తిరుగుబాటు చేయడంతో వారి కారు బోల్తా పడి దోపిడి దొంగలు ముగ్గురూ దుర్మరణం పాలౌతారు. అయితే ఆ కారులో వీళ్ళు దొంగిలించిన 17 కోట్ల రూపాయల డబ్బు ఉండదు. బ్యాంక్ నుంచి దోచుకున్న ఆ డబ్బులు వాళ్ళు ఎక్కడ పెట్టారో తెలుసుకోవడానికి పోలీసులు రంగంలోకి దిగుతారు. వాళ్ళ అనుమానం రాజీవ్ మీద పడుతుంది. అతను కూడా దోపీడీ దొంగల బృందానికి చెందిన వాడేమోననే అనుమానంతో ఇన్వెస్టిగేటివ్ పేరుతో అతన్ని మానసిక హింసకు గురిచేస్తారు. అప్పటి వరకూ నోబడీగా ఉన్న రాజీవ్‌ను ఈ సొసైటీ ఎలా ట్రీట్‌ చేసింది? 17 కోట్ల దొంగగా ముద్రపడిన అతనితో