
పాత గోడపై నెమలి డిజైన్ వాల్ డెకర్‌ను పెడితే, ఆ గోడ కొత్తగా మెరిసిపోతుంది. దీనికి మ్యాచింగ్ గా వెదురు దీపాన్ని (bamboo lamp) కూడా అమర్చితే లుక్ అదిరిపోతుంది. మీరు ఎక్కువ ఖర్చు పెట్టాలనుకోకపోతే, మండలా ఆర్ట్ డెకర్‌తో గోడను అలంకరించవచ్చు. ఇవి చూడటానికి చాలా ఫ్యాన్సీగా, ఆకర్షణీయంగా ఉంటాయి. ఖాళీ గోడలో ఒక షెల్ఫ్ పెట్టి, దానిపై ఫోటో ఫ్రేమ్‌లు, ఇతర డెకరేటివ్ వస్తువులను అందంగా సర్దవచ్చు. తక్కువ ధరలో గోడను అందంగా మార్చాలంటే, టాసెల్ హ్యాంగింగ్స్ (కుచ్చులు) మంచి ఆప్షన్. వీటిని గోడకు వేలాడదీసి అందమైన లుక్ తీసుకురావచ్చు. తక్కువ ఖర్చుతో ట్రెడిషనల్ లుక్ కావాలంటే, టేప్‌స్ట్రీ వాల్ హ్యాంగింగ్ బెస్ట్ ఆప్షన్. మీ సోఫా కవర్ లేదా పిల్లో రంగుకు మ్యాచ్ అయ్యే హ్యాంగింగ్ కొంటే ఇంకా బాగుంటుంది. మాక్రేమ్ వాల్ హ్యాంగింగ్స్ చూడటానికి చాలా క్యూట్‌గా ఉంటాయి, తక్కువ ధరకే దొరుకుతాయి. పిల్లి ఆకారం నుంచి రకరకాల డిజైన్లలో మీకు నచ్చింది ఎంచుకోవచ్చు. Toe Rings: పొడవాటి కాలి వేళ్లకు మెట్టెల డిజైన్లు Weight Loss: బరువు తగ్గించే పండ్లు.. రోజూ తింటే చాలు Toe Rings: పొడవాటి పాదాలకు నిండుదనాన్ని తెచ్చే మెట్టెల డిజైన్లు Kundan Pearl Jhmuka: చీరల మీదకు ఈ కుందన్ ముత్యాల జుంకాలు ట్రై చేయండి