
తెలుగు చిత్రసీమలో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా, కమెడియన్‌గా, విలన్‌గా తనదైన ముద్ర వేసుకున్నాడు సాయి. కేవలం సాయి అని చెప్తే గుర్తుపట్టకపోవచ్చు కానీ "గబ్బర్ సింగ్ సాయి" అంటే ఇట్టే గుర్తుపట్టేస్తారు. తన సినీ ప్రయాణంలో ఎదుర్కొన్న ఒడిదుడుకులు, వ్యక్తిగత జీవితంలోని ముఖ్య ఘట్టాలు, చిత్ర పరిశ్రమలోని అనుభవాలను ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నారు. సుమారు 250 చిత్రాలలో నటించినప్పటికీ, ఆశించిన స్థాయిలో అవకాశాలు, గుర్తింపు లభించడం లేదన్న ఆవేదన వ్యక్తం చేశారు సాయి. పవన్ కళ్యాణ్ "గబ్బర్ సింగ్" సినిమాలో "అంత్యాక్షరి" సీన్ తన కెరీర్‌కు ఒక మలుపు అని, ఆ సినిమా తర్వాతే తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు వచ్చిందని పేర్కొన్నారు. పవన్ కళ్యాణ్ పట్ల తనకున్న గౌరవాన్ని చాటుకుంటూ, ఆయన సెట్‌లో అందరినీ గుర్తుంచుకుంటారని, అద్భుతమైన వ్యక్తిత్వం కలవారని ప్రశంసించారు. సుమారు 9-10 సినిమాలలో పవన్ కళ్యాణ్‌తో కలిసి పనిచేశానని తెలిపారు సాయి. ఇది కూడా చదవండి : నా పాత్రకు ఇంపార్టెన్స్ లేదు..! కృష్ణ సినిమాకు నో చెప్పింది.. కట్ చేస్తే సినిమా సెన్సేషనల్ హిట్ అయ్యింది తన కెరీర్ తొలినాళ్లలో అవకాశాల కోసం పడిన కష్టాలు, పెట్రోల్ బంక్‌లో ఉద్యోగం, మూడో తరగతి ఫెయిలవ్వడం వంటి వ్యక్తిగత విషయాలను పంచుకున్నారు. రూ 100 పెట్రోల్ కోసం కూడా కష్టపడిన రోజుల నుంచి ఈ స్థాయికి చేరుకోవడం దైవ దయ, దర్శకుల ప్రోత్సాహం వల్లేనని చెప్పారు. మోహన్ బాబు గారే తనను పరిశ్రమకు పరిచయం చేశారని, ఆయన బ్యానర్‌లో నటులకు ఎప్పుడూ ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసుకునేవారని గుర్తు చేసుకున్నారు. రాజమౌళి, శ్రీను వైట్ల, హరీష్ శంకర్ వంటి దర్శకులు కూడా తనకు అవకాశాలు ఇచ్చారని తెలిపారు సాయి. ఇది కూడా చదవండి : ఏంటీ..! ఈ సీనియర్ హీరోయిన్ మహేష్ బాబు బంధువా.!! ఇన్నాళ్లు ఈ విషయం చాలా మందికి తెలియదే.. క్యారెక్టర్ ఆర్టిస్టులకు, ముఖ్యంగా చిన్న నటులకు