
మీరు పెట్రోల్ బంక్‌కు వెళ్లినప్పుడు E20 అనే పదాన్ని ఎప్పుడైనా గమనించారా? ఇటీవల సోషల్ మీడియాలో E20 పెట్రోల్‌పై ఎన్నో వార్తలు, వీడియోలు వైరల్ అవుతున్నాయి. "ఈ పెట్రోల్ వాడితే ఇంజిన్ పాడవుతుంది", "మైలేజ్ తగ్గిపోతుంది", "పాత బైక్‌లు, కార్లు దెబ్బతింటాయి", "ఇన్సూరెన్స్ కూడా వర్తించదు" అంటూ అనేక ప్రచారాలు జరుగుతున్నాయి. ఈ ప్రచారాలపై కేంద్ర ప్రభుత్వం తాజాగా 10 అంశాలతో కూడిన వివరణను విడుదల చేసింది. అసలు E20 అంటే ఏమిటి? దీనిపై ప్రభుత్వం ఏం చెబుతోంది? సోషల్ మీడియాలో వస్తున్న ఆరోపణల్లో నిజమెంత? ముందుగా E20 అంటే ఏంటో తెలుసుకుందాం. సాధారణ పెట్రోల్‌లో 20 శాతం ఇథనాల్, 80 శాతం పెట్రోల్ కలిపితే దానిని E20 అంటారు. ఇథనాల్ అనేది చెరకు, మొక్కజొన్న, బియ్యం వంటి వ్యవసాయ ఉత్పత్తుల నుంచి తయారయ్యే బయోఫ్యూయల్. ముడి చమురు దిగుమతులపై ఆధారాన్ని తగ్గించడం, రైతులకు అదనపు ఆదాయం కల్పించడం, కార్బన్ ఉద్గారాలను తగ్గించడం లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ఇథనాల్ బ్లెండింగ్ కార్యక్రమాన్ని అమలు చేస్తోంది. అయితే, భారత్ ఇప్పటికే E20 లక్ష్యాన్ని చేరుకుంది. కానీ, ఈ విధానం అమలులోకి వచ్చిన తర్వాత సోషల్ మీడియాలో అనేక సందేహాలు వ్యక్తమయ్యాయి. ముఖ్యంగా E20 పెట్రోల్ వల్ల ఇంజిన్ దెబ్బతింటుందని, ఫ్యూయల్ పైపులు పాడవుతాయని, మైలేజ్ భారీగా తగ్గిపోతుందని, పాత వాహనాలకు ఇది ప్రమాదకరమని, ఇథనాల్ తయారీకి భారీగా నీరు వృథా అవుతోందని, అంతేకాదు ఇన్సూరెన్స్ క్లెయిమ్‌లు కూడా వర్తించవని ప్రచారం జరిగింది. ఈ ప్రచారాలపై కేంద్ర పెట్రోలియం, సహజవాయు మంత్రిత్వ శాఖ స్పందించింది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న అనేక వాదనలు శాస్త్రీయ ఆధారాలు లేనివని తెలిపింది. ప్రభుత్వం విడుదల చేసిన 10 పాయింట్ల వివరణలో మొదటగా ఇంజిన్ డ్యామేజ్ అంశాన్ని ప్రస్తావించింది. E20 వల్ల పెద్ద ఎత్తున ఇంజిన్‌లు పాడవుతున్నాయనే ఆరోపణలకు ఆధారాలు లేవని తెలిపింది. భారత ఆటోమోటివ్ రీసెర్చ్ అసోసియేషన్ (ARAI) నిర్వహించిన