పెట్ డాగ్ కు బర్త్ డే చేసిన హీరోయిన్.. అమ్మాయిలా ముస్తాబు చేసి మరీ సెలబ్రేషన్స్.. ఫొటోస్ ఇదిగో
Actor ProfileActor

పెట్ డాగ్ కు బర్త్ డే చేసిన హీరోయిన్.. అమ్మాయిలా ముస్తాబు చేసి మరీ సెలబ్రేషన్స్.. ఫొటోస్ ఇదిగో

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
పెట్ డాగ్ కు బర్త్ డే చేసిన హీరోయిన్.. అమ్మాయిలా ముస్తాబు చేసి మరీ సెలబ్రేషన్స్.. ఫొటోస్ ఇదిగో
TV9 Telugu21 Nov 2026
పెట్ డాగ్ కు బర్త్ డే చేసిన హీరోయిన్.. అమ్మాయిలా ముస్తాబు చేసి మరీ సెలబ్రేషన్స్.. ఫొటోస్ ఇదిగో

ఈ మధ్యన పెట్ డాగ్స్ ను కూడా కుటుంబ సభ్యులతో సమానంగా చూసుకుంటున్నారు చాలా మంది. ముఖ్యంగా మెట్రో నగరాల్లో అయితే దాదాపు ప్రతి ఇంట్లో పెట్ డాగ్ ను పెంచుకుంటున్నారు. కేవలం సామాన్యులే కాదు సెలబ్రిటీలు కూడా ఇంట్లోనే పెట్ డాగ్స్ ను పెంచుకుంటున్నారు. ప్రముఖ తమిళ నటి మహాలక్ష్మికి కూడా మూగజీవాలంటే ఇష్టం. అందుకే ఆమె ఇంట్లోనే మైలో అనే ఓ పెట్ డాగ్ ను పెంచుకుంటోంది. సినిమాలు, సీరియల్స్ పనుల్లో ఎంత బిజీగా ఉన్నా తన పెట్ డాగ్ కు ఎంతో అపురూపంగా చూసుకుంటోందీ అందాల తార. తాజాగా మైలో బర్త్ డేను గ్రాండ్ గా సెలబ్రేట్ చేసింది మహాలక్ష్మి. ఇందులో భాగంగా తన పెట్ డాగ్ కు అందమైన డ్రెస్ వేసి అమ్మాయిలా ముస్తాబు చేసిందీ ముద్దుగుమ్మ. ప్రత్యేకంగా కేక్ రెడీ చేసి మైలోతోనే క‌ట్ చేయించింది. అనంతరం తన పెట్ డాగ్ బర్త్ డేకు సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. మహాలక్ష్మి షేర్ చేసిన ఫొటోస్ ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారాయి. వీటిని చూసిన నెటిజన్లు క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే తమిళ సినిమాలు, సీరియల్స్ చూసే వారికి మహాలక్ష్మి బాగా పరిచయం. కొన్నేళ్ల క్రితం ఈ ముద్దుగుమ్మ పేరు తెగ మార్మోగిపోయింది. మహాలక్ష్మి ప్రముఖ నిర్మాత రవీందర్ చంద్రశేఖర్‏ ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. 2022లో వీరి పెళ్లి జరిగినప్పుడు సోషల్ మీడియాలో ఘోరమైన ట్రోల్స్ వచ్చాయి. ముఖ్యంగా భారీకాయంతో కనిపించే రవీందర్‌ను కొందరు నెటిజన్లు బాడీ షేమింగ్‌ చేస్తూ నెట్టింట పోస్టులు షేర్‌ చేశారు ఇక డబ్బు కోసమే మహాలక్ష్మి చంద్రశేఖరన్‌ను వివాహం చేసుకుందంటూ నెట్టింట ట్రోల్స్ చేశారు. అయితే ఈ విమర్శలు, ఆన్ లైన్ ట్రోల్స్‌ను చాలా లైట్‌గా తీసుకున్నారీ లవ్లీ కపుల్‌. ప్రస్తుతం వీరు హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తున్నారు. మహాలక్ష్మి- చంద్రశేఖరన్ ఫొటోలు

ప ట డ గ క బర త డ చ స న హ ర య న అమ మ య ల మ స త బ చ స మర స లబ ర షన స ఫ ట స ఇద గ Latest News, Movies & Updates | nimisham.in | nimisham.in