పాకిస్థాన్ లో భద్రతా సంక్షోభం
Actor ProfilePolitician

పాకిస్థాన్ లో భద్రతా సంక్షోభం

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
పాకిస్థాన్ లో భద్రతా సంక్షోభం
TeluguOne28 Sept 2026
పాకిస్థాన్ లో భద్రతా సంక్షోభం

పాకిస్తాన్ ప్రస్తుతం ఆ దేశ చరిత్రలోనే మున్నెన్నడూ లేనంత క్లిష్టమైన అంతర్గత భద్రతా సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. సరిహద్దుల వెలుపల నుంచి వచ్చే ముప్పుల కంటే.. సొంత భూభాగంలోనే వేగంగా విస్తరిస్తున్న అంతర్గత హింసను అదుపు చేయడంలో పాకిస్థాన్ అధికార యంత్రాంగం విఫలమవుతోంది. ఒకప్పుడు పొరుగు దేశాలపై వ్యూహాత్మక ప్రయోజనాల కోసం, రాజకీయ లబ్ధి కోసం ఏ మిలిటెంట్ నెట్‌వర్క్‌లను అయితే ప్రోత్సహించిందో.. ఇప్పుడు అవే శక్తులు ఆ దేశానికే పెను శాపంగా మారాయి. దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాలలో చోటుచేసుకుంటున్న ఉగ్రదాడులు, పెరుగుతున్న అంతర్గత విభేదాల మధ్య శాంతిభద్రతలను పునరుద్ధరించడం అక్కడి రక్షణ దళాలకు కత్తిమీద సాములా మారింది. బలూచిస్తాన్ ప్రావిన్స్‌లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు ఆందోళనకరంగా ఉన్నాయి. అక్కడ క్రియాశీలంగా ఉన్న బలూచ్ లిబరేషన్ ఆర్మీ (బీఎల్ఎ) వంటి సంస్థలు పాకిస్తాన్ సైనిక స్థావరాలు, పారామిలిటరీ దళాలను లక్ష్యంగా చేసుకుని దాడులను ముమ్మరం చేశాయి. ముఖ్యంగా జివానీ ప్రాంతంలోని పాకిస్తాన్ కోస్ట్ గార్డ్ కార్యాలయంపై జరిగిన ఆత్మాహుతి దాడి తీవ్ర కలకలం రేపింది. ఈ భీకర దాడిలో భారీ ఎత్తున ఆస్తి నష్టంతో పాటు ప్రాణనష్టం సంభవించింది. తిరుగుబాటుదారులు కేవలం మారుమూల లేదా కొండ ప్రాంతాలకే పరిమితం కాలేదని, కట్టుదిట్టమైన భద్రత ఉండే రక్షణ రంగ ప్రధాన స్థావరాలపై సైతం వ్యూహాత్మకంగా దాడులు చేయగల సామర్థ్యాన్ని పెంచుకున్నారని ఈ ఘటన నిరూపించింది. మరోవైపు ఖైబర్ పఖ్తూన్‌ఖ్వా ప్రావిన్స్ సైతం నిరంతర ఉగ్రవాద ఒత్తిడితో కొట్టుమిట్టాడుతోంది. చిత్రాల్ సరిహద్దు ప్రాంతంలో తెహ్రిక్-ఇ-తాలిబాన్ పాకిస్తాన్ (టీటీపీ) రక్షణ దళాల పోస్టును స్వాధీనం చేసుకుని సృష్టించిన బీభత్సం తీవ్ర సంచలనం సృష్టించింది. ఈ ఘర్షణలో పలువురు సైనికులు ప్రాణాలు కోల్పోగా, ఒక సైనికుడిని ఉగ్రవాదులు బందీగా పట్టుకున్నారు. ఇటువంటి వరుస ఘటనలు సరిహద్దు జిల్లాలపై ప్రభుత్వానికి ఉన్న పట్టును బలహీనపరుస్తున్నాయి. భద్రతా విభాగాలలో క్రమశిక్షణ పతనం కావడం, వ్యూహాత్మక లోపాలు స్పష్టంగా కనిపిస్తుండటంతో దేశంలో అశాంతి రోజురోజుకూ విస్తరిస్తోంది