నవంబర్ లో అనిరుధ్ పెళ్లి పక్కా!
Actor ProfileActor

నవంబర్ లో అనిరుధ్ పెళ్లి పక్కా!

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
నవంబర్ లో అనిరుధ్ పెళ్లి పక్కా! - తెలుగు సినిమా న్యూస్, రివ్యూస్
Telugu Cinema6 Jan 2027
నవంబర్ లో అనిరుధ్ పెళ్లి పక్కా! - తెలుగు సినిమా న్యూస్, రివ్యూస్

ప్రముఖ సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్ (Anirudh Ravichander తన సినిమాలతోనే కాకుండా వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాలతోనూ వార్తల్లో నలుగుతున్నాడు. సన్ నెట్‌వర్క్ ఛైర్మన్ కళానిధి మారన్ కుమార్తె, సన్‌రైజర్స్ హైదరాబాద్ సీఈఓ కావ్య మారన్‌ (Kavya Maran)ను అనిరుధ్ త్వరలో వివాహం చేసుకోబోతున్నాడంటూ పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఈ ఏడాది నవంబర్ 10న వీరి వివాహం జరగనుందని, దీనికోసం గ్రీస్‌ను వేదికగా ఎంచుకున్నారనే ప్రచారం సాగుతోంది. ఈ పెళ్లి రూమర్స్ గతంలోనూ సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి, కానీ ఇప్పుడు తేదీ, వేదిక కూడా జోడించి ఊహాగానాలు విస్తరించాయి. ఈసారి మాత్రం వినిపిస్తున్నవి ఊహాగానాలు కావని, పెళ్లి పక్కా అని తెలుస్తోంది. అయితే, ఈ వార్తలపై ఇప్పటివరకు అనిరుధ్ గానీ, కావ్య మారన్ గానీ ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. ఇది కేవలం ఇండస్ట్రీలో జరుగుతున్న చర్చలు, సోషల్ మీడియా ఊహాగానాలేనని, ఇరు కుటుంబాల నుండి ఎలాంటి కన్ఫర్మేషన్ రాలేదని స్పష్టమవుతోంది. ప్రస్తుతం కెరీర్ పరంగా ఎంతో బిజీగా ఉన్న అనిరుధ్, ఈ పెళ్లి వార్తల నేపథ్యంలో తన వృత్తిపరమైన బాధ్యతలను త్వరగా ముగించే పనిలో ఉన్నట్లు తెలుస్తోంది. ‘ది ప్యారడైజ్’, ‘జైలర్ 2’ పనులు పూర్తిచేశాడు అనిరుధ్. వివాహ వేడుకల అనంతరం మిగిలిన పనులను తిరిగి ప్రారంభించబోతున్నాడు