
తెలంగాణ వాదుల ముసుగులో కాళేశ్వరంపై భారాస వాదన వినిపిస్తున్న విశ్రాంత ఇంజినీర్లు గతంలో జరిగిన దోపిడీలు, అక్రమాల్లో వారికీ సంబంధం ఉంది ప్రాజెక్టు బాధ్యతను కిలాడీ కమిటీకి అప్పగించం ఈ కమిటీకి ఛైర్మన్ కేసీఆర్.. సభ్యుడు హరీశ్‌రావు ఇప్పుడు ఇందులో ఈటల కూడా చేరి భారాస పల్లవి అందుకున్నారు సీఎం రేవంత్‌రెడ్డి ఘాటు విమర్శలు ఈనాడు, హైదరాబాద్: మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల అవసరం లేకుండానే నీటిని ఎత్తిపోసేలా ఉంటే భారీగా ఖర్చు చేసి బ్యారేజీలను ఎందుకు నిర్మించారని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రశ్నించారు. గత పాలకులు అన్ని రకాల తప్పులు చేసి, అవకతవకలకు పాల్పడి ఇప్పుడు తమ ప్రభుత్వంపై బురదజల్లే రాజకీయం చేస్తున్నారని ధ్వజమెత్తారు. కాళేశ్వరం ప్రాజెక్టు బాధ్యతను నేషనల్ డ్యాం సేఫ్టీ అథారిటీ(ఎన్డీఎస్‌ఏ) కమిటీకి అప్పగించడానికి ఎలాంటి అభ్యంతరం లేదని, కిలాడీ కమిటీకి మాత్రం కాదని అన్నారు. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, పొన్నం ప్రభాకర్, రాజ్యసభ సభ్యులు వేం నరేందర్‌రెడ్డి, పలువురు ఎమ్మెల్యేలతో కలిసి ముఖ్యమంత్రి శనివారం ఇక్కడ సచివాలయంలో విలేకరులతో మాట్లాడారు. ‘‘నదిలో పరిగెత్తే నీళ్లను ఎత్తిపోయగలిగితే ఇంక బ్యారేజీలు ఎందుకు? భారాస మాట్లాడితే సీరియస్‌గా తీసుకోవాల్సిన అవసరం లేదు. విశ్రాంత ఇంజినీర్ల సంఘం వారు తెలంగాణ వాదుల ముసుగులో భారాస వాదన వినిపిస్తున్నారు. నీళ్లు ఎత్తిపోయాలంటున్నారు. 2015 డిసెంబరులో విశ్రాంత ఇంజినీర్లతో కమిటీ ఏర్పాటు చేస్తే మేడిగడ్డ వద్ద బ్యారేజీ వద్దు.. తుమ్మిడిహెట్టి వద్ద.. కాదంటే వేమనపల్లి వద్ద కట్టమని చెప్పింది. ఆ కమిటీలో ఉన్న శ్యాంప్రసాద్‌రెడ్డి ఇప్పుడు సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. ఇలాంటి వాళ్లకు ముసుగు వేసి కిలాడీ కమిటీ మమ్మల్ని దోషులుగా చూపే ప్రయత్నం చేస్తోంది’’ అంటూ విశ్రాంత ఇంజినీర్ల సంఘంపై తీవ్రస్థాయిలో మాట్లాడారు. గతంలో జరిగిన దోపిడీలు, అక్రమాలు, అవకతవకల్లో ఈ సంఘంలోని వారికి కూడా సంబంధం ఉందన్నారు. కిలాడీ కమిటీకి కేసీఆర్ ఛైర్మన్ కాగా, హరీశ్‌రావు సభ్యుడు. ఇప్పుడు భాజపా ఎంపీ