
ఆరు నెలల ముచ్చట అనుకుంటే ఏడాది కావస్తోంది.. రికార్డు స్థాయి సుదీర్ఘ మిషన్‌తో సైనికులకు సముద్ర ప్రయాణం నరకంగా మారింది. యుద్ధ విమానాలు గాల్లోకి ఎగరడం వరకే లోకానికి కనిపిస్తోంది. కానీ ఆ భారీ యుద్ధనౌకల లోపల తాగునీరు లేక, టాయిలెట్లు పనిచేయక, కనీసం తాగడానికి నీరు లేక.. కంపుకొడుతున్న బట్టలు ఉతుక్కునే దిక్కులేక వేలాది మంది జవాన్లు మనోవేదనతో కుమిలిపోతున్నారు. ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన యుద్ధనౌక ఇప్పుడు సైనికులను ఆత్మహత్యలు చేసుకునేంత ఒత్తిడిలోకి నెడుతుంది.అమెరికా రక్షణ శాఖ ప్రతిష్ఠాత్మకంగా భావించే యుఎస్ఎస్ అబ్రహాం లింకన్ విమానవాహక నౌక ఇప్పుడు ఓ కదులుతున్న జైలులా మారింది. సాధారణంగా నేవీ నిబంధనల ప్రకారం ఏ యుద్ధనౌక అయినా ఏడు నెలలకు మించి సముద్రంలో ఉండకూడదు. కానీ, అంతర్జాతీయంగా చెలరేగుతున్న యుద్ధాలు, ఉద్రిక్తతల నెపంతో నావికులకు ఇంటిబాట లేకుండా చేస్తున్నారు. వియత్నాం యుద్ధం తర్వాత అత్యధిక కాలం సముద్రంలోనే గడిపిన నౌకగా ఇటీవలే యుఎస్ఎస్ జెరాల్డ్ ఆర్ ఫ్రాంక్ నిలిచింది. సరిగ్గా 326 రోజుల పాటు ఆ నౌకను సముద్రంలోనే ఉంచారు. ఇప్పుడు అబ్రహాం లింకన్ నౌక కూడా ఆ రికార్డును దాటేసేలా కనిపిస్తోంది. డిసెంబర్ తర్వాత నావికులు కనీసం ఒడ్డుపై కాలు మోపిన పాపాన పోలేదు.నీళ్లు రావు.. టాయిలెట్లు పనిచేయవు!నౌకలో పరిస్థితి ఏమీ బాగోలేదని అక్కడ పనిచేస్తున్న జవాన్లు, వారి కుటుంబ సభ్యులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రతిరోజూ ఉదయాన్నే కెప్టెన్ మైక్‌లో మాట్లాడేటప్పుడు ఈ రోజు అయినా ఇంటికి వెళ్లే వార్త చెప్తారా అని సైనికులు ఆశగా ఎదురుచూస్తున్నారు. మరోవైపు నౌకలో ప్రాథమిక సదుపాయాలు ఘోరంగా తయారయ్యాయి. వాటర్ ట్యాప్స్ చెడిపోయి, వేడినీళ్లు రాక జవాన్లు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. టాయిలెట్లు పొంగిపొర్లుతున్నాయని, షిప్ స్టోర్లలో కనీసం స్నానం చేసే సబ్బులు, టూత్‌పేస్టులు కూడా దొరకడం లేదని నావికులు వాపోతున్నారు. గతంలో కావలసినన్ని వస్తువులు కొనుక్కునే వెసులుబాటు ఉండేదని, ఇప్పుడు ప్రతీ దానికి