
Eenadu•6 Oct 2026
నటుడిగా తమన్ .. హృదయం మురళి’ ట్రైలర్ వచ్చేసిందిటాలీవుడ్ సంగీత దర్శకుడు తమన్ మరోసారి నటుడిగా మారాడు. అథర్వ మురళీ నటిస్తున్న తమిళ చిత్రం ‘ఇదయం మురళి’లో తమన్ కీలక పాత్ర పోషించారు. ఈ చిత్రం తెలుగులో ‘హృదయం మురళి’ పేరుతో జులై 10న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలోనే చిత్రబృందం తెలుగు ట్రైలర్‌ను తాజాగా విడుదల చేసింది. రొమాంటిక్, మ్యూజికల్ ఎంటర్‌టైనర్‌గా రాబోతున్న ఈ చిత్రానికి తమనే సంగీతం అందించడం విశేషం. ఆకాశ్ భాస్కరన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ప్రీతి ముకుందన్, కయదు లోహర్ హీరోయిన్లు. 20ఏళ్ల క్రితం శంకర్ ‘బాయ్స్’లో తమన్ నటించిన విషయం తెలిసిందే