
HMTV•24 Dec 2026
నగరిలో ఘనంగా 80వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలుNagari: నగరిలో ఘనంగా 80వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు! Nagari: నగరి మున్సిపాలిటీ సత్రవాడ మండల ప్రాథమిక పాఠశాల జిల్లా ఉన్నత పాఠశాలల నందు జరిగిన 80వ స్వాతంత్య్ర వేడుకల్లో నగరి ఎమ్మెల్యే గాలి భాను ప్రకాష్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు.. ఈ నేపథ్యంలో విద్యార్థులచే గౌరవ వందన స్వీకరించి స్వాతంత్ర్య సమరయోధుల చిత్రపటాలకు ఘనంగా నివాళులర్పించారు.అనంతరం నగరి ఎమ్మెల్యే గాలి భాను ప్రకాష్ జాతీయ త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే భాను ప్రకాష్ మాట్లాడుతూ నేటి భారత 80వ స్వాతంత్య్ర దినోత్సవం.ఎందరో స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలు, పోరాటాల ఫలితంగానే దేశానికి స్వాతంత్ర్యం లభించిందన్నారు. స్వాతంత్య్ర కోసం పోరాడిన మహనీయుల స్ఫూర్తిని నేటి యువత ప్రజలు ఆదర్శంగా తీసుకుని దేశ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని పేర్కొన్నారు