
దేశంలో సాయుధ నక్సలిజం, మావోయిస్టు హింసను దాదాపుగా అంతం చేశామని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. అయితే మావోయిస్టు భావజాలం మాత్రం ఇంకా కొనసాగుతోందని హెచ్చరించారు. ఆ ఆలోచనా విధానంతో ఉన్న వారిని ‘దిమాగీ నక్సల్స్’గా పేర్కొన్నారు. ఇలాంటి వ్యక్తులు అవకాశాల కోసం ఎదురుచూస్తున్నారని, సమాజంలో హింస, అశాంతిని ప్రేరేపించేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఎర్రకోట నుంచి దేశ ప్రజలను ఉద్దేశించి చేసిన ప్రసంగంలో మోదీ ఈ వ్యాఖ్యలు చేశారు.అడవుల్లో సాయుధ నక్సల్స్‌ను నిర్మూలించడంలో ప్రభుత్వం విజయం సాధించిందని ప్రధాని చెప్పారు. దశాబ్దాలుగా దేశాన్ని వేధించిన ఈ సమస్య నుంచి ప్రజలకు విముక్తి కల్పించామని అన్నారు. అయితే సాయుధ నక్సల్స్ అంతమైనా వారి భావజాలం పూర్తిగా అంతం కాలేదని పేర్కొన్నారు. మావోయిస్టు ఆలోచనా విధానం ఉన్న కొందరు సంస్థలు, వ్యవస్థల్లోకి చొరబడి ప్రభావం చూపేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. అలాంటి వారిని గుర్తించి అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు.2014లో తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రోజే దేశాన్ని నక్సలిజం నుంచి విముక్తి చేయాలని నిర్ణయించుకున్నామని మోదీ తెలిపారు. దాదాపు నాలుగు దశాబ్దాల పాటు నక్సలిజం దేశంలోని అనేక ప్రాంతాలను తీవ్రంగా ప్రభావితం చేసిందన్నారు. యువత, కుటుంబాలు, భద్రతా బలగాలు ఈ హింసతో తీవ్రంగా నష్టపోయాయని చెప్పారు. తుపాకీ భయంతో ప్రజలను బందీలుగా మార్చిన పరిస్థితులు ఉండేవని, రాజ్యాంగ వ్యవస్థను బలహీనపరిచేందుకు మావోయిస్టులు ప్రయత్నించారని ఆరోపించారు. ప్రస్తుతం నక్సలిజం చివరి దశలో ఉందని, పూర్తిగా నిర్మూలించే దిశగా వేగంగా ముందుకు సాగుతున్నామని అన్నారు.సాయుధ నక్సలిజంపై